ప్రస్తుత కాలంలో ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారికి కాస్త ఊరటనిచ్చే వార్త ఇది. రాబోయే సెప్టెంబర్ 2026 వరకు గ్రహాల గమనంలో వస్తున్న కీలక మార్పులు కొందరికి సువర్ణ అవకాశాలను తెచ్చిపెట్టనున్నాయి. ముఖ్యంగా జీవన గమనాన్ని మార్చే శక్తి ఉన్న గురు, శని గ్రహాల స్థితిగతులు మానవ జీవితాలపై బలమైన ప్రభావాన్ని చూపుతాయి.

ప్రస్తుతం దేవగురువు బృహస్పతి కర్కాటక రాశిలో సంచరిస్తుండగా, నవగ్రహాలలో కర్మదాత అయిన శనిదేవుడు మీన రాశిలో వక्री దశలో పయనిస్తున్నారు. ఈ అరుదైన గ్రహ కలయిక మరియు సంచారం వల్ల ఏయే రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుందో ఇక్కడ తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
జ్యోతిష్య నిపుణుల అంచనా ప్రకారం వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ వరకు గల కాలం అత్యంత కీలకమైనదిగా మారనుంది. ఈ రాశికి తొమ్మిదవ స్థానంలో గురు సంచారం జరుగుతుండటం వల్ల అదృష్టం సంపూర్ణంగా తోడుంటుంది. ఉన్నత విద్య, ఆధ్యాత్మిక చింతన, దూర ప్రయాణాలకు ఇది సరైన సమయం. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగవంతం అవుతాయి.
ఉద్యోగం మారాళ్లని ప్రయత్నించే వారికి ప్రముఖుల సిఫార్సులతో మంచి మార్గాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిలిచిపోయిన బకాయిలు చేతికి అందుతాయి అని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడటంతో పాటు కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
మకర రాశి
మకర రాశి వారికి గురు గ్రహ సంచారం వ్యాపార భాగస్వామ్యాలు మరియు వృత్తిపరమైన సంబంధాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. సెప్టెంబర్ నాటికి పాత పరిచయాలు వ్యాపారాన్ని లాభాల బాట పట్టించడానికి దోహదపడతాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, కస్టమర్ల సంఖ్య పెంచుకోవడానికి ఇది అనుకూల సమయం.
ఆఫీసులో మీ కష్టానికి తగిన గుర్తింపు లభించడంతో పాటు పదోన్నతుల గురించి ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అందే అవకాశం ఉంది. అయితే ఏ నిర్ణయమైనా ఆచితూచి వ్యవహరించి తీసుకోవడం ఉత్తమం. నిలిచిపోయిన పేమెంట్లు తిరిగి రావడంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కర్కాటక రాశి
{{/usCountry}}ఆఫీసులో మీ కష్టానికి తగిన గుర్తింపు లభించడంతో పాటు పదోన్నతుల గురించి ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అందే అవకాశం ఉంది. అయితే ఏ నిర్ణయమైనా ఆచితూచి వ్యవహరించి తీసుకోవడం ఉత్తమం. నిలిచిపోయిన పేమెంట్లు తిరిగి రావడంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కర్కాటక రాశి
{{/usCountry}}సొంత రాశిలో గురు సంచారం జరుగుతుండటంతో కర్కాటక రాశి వారు ఈ కాలంలో అత్యున్నత ఫలితాలను చవిచూస్తారు. అక్టోబర్ 31 వరకు ఇదే స్థితి కొనసాగనుండటంతో వీరికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. వృత్తి జీవితంలో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కీలక నిర్ణయాలు మీకు అనుకూలంగా మారుతాయి.
ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా సరైన సమయంలో తగిన వ్యక్తి సహాయంతో సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలలో సఫలీకృతం అవుతారు. అయితే రాబడి ఎంత పెరుగుతుందో, ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉన్నందున ఆర్థిక నియంత్రణ చాలా అవసరం. మొత్తంగా చూస్తే, గ్రహాల ఈ ప్రత్యేక గమనం కొందరి జీవితాల్లో కొత్త వెలుగులను నింపనుంది. సరైన ప్రణాళిక, కష్టపడే తత్వంతో ముందుకు వెళ్తే ఈ కాలాన్ని అద్భుతంగా మలుచుకోవచ్చు.