...
...
Next Story

ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని - ఈ రాశులవారికి పెరగనున్న ఆదాయం, ఉద్యోగంలో కొత్త అవకాశాలు!

అక్టోబర్ 9న శని దేవుడు తన సొంత నక్షత్రమైన ఉత్తరభాద్రపదంలోకి ప్రవేశించనున్నాడు. 2027 ఫిబ్రవరి వరకు కొనసాగే ఈ నక్షత్ర మార్పు వల్ల ఏ రాశుల వారికి ఆర్థిక లబ్ధి, కెరీర్‌లో పురోగతి లభిస్తుంది.

Published on: Oct 8, 2026, 16:16:34 IST
By , नई दिल्ली
Prefer HTon Google
Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడి నక్షత్ర మార్పుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. కర్మ ఫలదాత, న్యాయాధిపతి అయిన శని దేవుడు 2026 అక్టోబర్ 9వ తేదీ రాత్రి 7:28 గంటలకు తన నక్షత్రాన్ని మార్చుకోనున్నాడు. ప్రస్తుతం తిరోగమన స్థితిలో ఉన్న శని దేవుడు ఉత్తరభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. విశేషమేమిటంటే ఈ ఉత్తరభాద్రపద నక్షత్రానికి అధిపతి స్వయంగా శని దేవుడే కావడం విశేషం.

ఉత్తరభాద్రపదంలోకి శని సంచారం (Pinterest)
ఉత్తరభాద్రపదంలోకి శని సంచారం (Pinterest)

శని దేవుడు తన సొంత నక్షత్రంలోకి అడుగుపెట్టే ఈ అరుదైన పరిస్థితి 2027 ఫిబ్రవరి 8వ తేదీ వరకు కొనసాగుతుంది. జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం….. శని గ్రహం మన పని, ఉద్యోగం, బాధ్యత, న్యాయంతో నేరుగా అనుసంధానమై ఉంటుంది. ఈ నేపథ్యంలో శని నక్షత్ర రాశి మార్పు ప్రభావం అన్ని రాశుల వారి ఆర్థిక స్థితి, వృత్తి ఉద్యోగాలపై స్పష్టంగా కనిపిస్తుంది. విశేషించి కష్టపడి పనిచేసే గుణం, క్రమశిక్షణ, దీర్ఘకాలిక లక్ష్యాలపై ఈ సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. దీనివల్ల కొందరికి నిలిచిపోయిన పనుల్లో విజయం లభిస్తే, మరికొందరికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఈ నక్షత్ర మార్పు వల్ల ప్రధానంగా ప్రయోజనం పొందే 5 రాశుల వివరాలు ఇవే….

వృషభ రాశి:

వృషభ రాశి జాతకులకు శని నక్షత్ర మార్పు ఆర్థిక విషయాల్లో పెద్ద ఎత్తున ఊరటనిస్తుంది. మీ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మీ బాధ్యతలు పెరిగినప్పటికీ, అవి భవిష్యత్తులో మీకు మరింత ఎక్కువ ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి పాత పరిచయాలు, సంబంధాలు ఎంతోగానో ఉపయోగపడతాయి. సుదీర్ఘకాలంగా రాకుండా నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

మిథున రాశి:

తులా రాశి వారికి శని యొక్క ఈ నక్షత్ర సంచారం పని ప్రదేశంలో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఉద్యోగంలో మీ స్థానాన్ని, బలాన్ని మరింత పెంచుకునే సువర్ణ అవకాశం లభిస్తుంది. ఉన్నతాధికారులు మీ పనితీరుతో పూర్తి సంతృప్తి చెందుతారు. వ్యాపారంలో కూడా మెరుగైన ప్రగతి కనిపించనుంది. ధనానికి సంబంధించిన పాత సమస్యలు, వివాదాలు ఈ సమయంలో పరిష్కారమవుతాయి.

మకర రాశి:

మకర రాశి జాతకులకు శని దేవుడు తన సొంత నక్షత్రంలోకి ప్రవేశించడం ఎంతో ప్రత్యేకమైనదిగా మారనుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ, దానికి తగ్గ ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలకు సంబంధించిన చర్చలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. వ్యాపారవేత్తలకు పాత ఒప్పందాలు (డీల్స్) ద్వారా ఆకస్మిక లాభాలు అందే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ మరింత బలపడుతుంది.

కుంభ రాశి:

కుంభ రాశి వారు తమ కెరీర్‌లో వేగంగా ముందుకు సాగే అవకాశాలను పొందుతారు. ఉద్యోగంలో గత కొంతకాలంగా చిక్కుల్లో పడి నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కంపెనీలో కొత్త బాధ్యతలు చేపట్టడంతో మీ పాత్ర మరియు హోదా పెరుగుతాయి. వ్యాపారంలో పాత కస్టమర్లు మళ్లీ మీ వద్దకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా చూస్తే ఈ సమయం మీకు ఎంతో అనుకూలమైన సంకేతాలను ఇస్తోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks