జ్యోతిష్యశాస్త్రంలో శనిదేవుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. ఆయనను న్యాయం, కర్మ, క్రమశిక్షణలకు అధిపతిగా భావిస్తారు. శని దేవుడు తన రాశిని మార్చినా లేదా తన సంచార వేగంలో మార్పులు చేసుకున్నా…. ఆ ప్రభావం ద్వాదశ రాశుల జీవితాలపై విభిన్న రూపాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం శని గ్రహం తిరోగమన స్థితిలో (వెనుకకు పయనించడం) సంచరిస్తోంది. రాశిచక్రంలోని పలు రాశుల వారికి ఈ గ్రహ స్థితి అత్యంత కీలకమైనదిగా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

శని తిరోగమన సంచారం రాబోయే డిసెంబర్ 11 వరకు కొనసాగనుంది. అంటే శని దేవుడి ప్రభావం ఈ రూపంలో మరో 90 రోజుల పాటు స్పష్టంగా ఉండబోతోంది. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం.. శని తిరోగమనంలో ఉన్న సమయంలో గతంలో నిలిచిపోయిన పనులు, అసంపూర్తిగా వదిలేసిన అంశాలు మళ్లీ ముందరకు వస్తాయి. చాలా కాలంగా ఆలస్యమవుతూ వస్తున్న పనుల్లో క్రమంగా కదలిక వచ్చి వేగం పుంజుకునే అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో, కొందరు వ్యక్తులు తమ పాత నిర్ణయాలను, పని చేసే శైలిని పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ 90 రోజుల కాలంలో ప్రధానంగా 5 రాశుల వారిపై పడే ప్రభావం ఎలా ఉందో వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి:
ఈ రాశి జాతకులకు రాబోయే సమయం తీవ్రమైన శ్రమతో కూడుకున్నది, అలాగే అంతే ముఖ్యమైనది. గతంలో మీరు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన పాత పనులను పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. ఉద్యోగ మార్పు కోసం లేదా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి సానుకూల సంకేతాలు అందుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు తమ పాత పరిచయాల ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు.
వృషభ రాశి :
వృషభ రాశి వారు ఈ శని తిరోగమన సమయంలో ఆర్థిక విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఒకవైపు రాబడి పెరిగినప్పటికీ, దానికి అనుగుణంగానే ఖర్చులు కూడా ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉంది. అయితే, పాత పెట్టుబడుల ద్వారా లేదా ఎక్కడైనా చిక్కుకుపోయిన రావలసిన డబ్బు తిరిగి చేతికి అందడంతో కొంత ఊరట లభిస్తుంది. ఈ సమయంలో ఎలాంటి ఆలోచన లేకుండా పెద్ద మొత్తంలో కొత్త పెట్టుబడులు పెట్టకపోవడమే శ్రేయస్కరం.
మిథున రాశి :
{{/usCountry}}వృషభ రాశి వారు ఈ శని తిరోగమన సమయంలో ఆర్థిక విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఒకవైపు రాబడి పెరిగినప్పటికీ, దానికి అనుగుణంగానే ఖర్చులు కూడా ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉంది. అయితే, పాత పెట్టుబడుల ద్వారా లేదా ఎక్కడైనా చిక్కుకుపోయిన రావలసిన డబ్బు తిరిగి చేతికి అందడంతో కొంత ఊరట లభిస్తుంది. ఈ సమయంలో ఎలాంటి ఆలోచన లేకుండా పెద్ద మొత్తంలో కొత్త పెట్టుబడులు పెట్టకపోవడమే శ్రేయస్కరం.
మిథున రాశి :
{{/usCountry}}మిథున రాశి వారికి ఈ కాలం కెరీర్‌లో గణనీయమైన మార్పులను సూచిస్తోంది. ఆఫీసులో లేదా వర్క్‌ప్లేస్‌లో మీరు గతంలో పడ్డ కష్టానికి ఫలితం దక్కడానికి కాస్త సమయం పట్టవచ్చు, కానీ మీ శ్రమ మాత్రం ఏమాత్రం వృథా పోదు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు తలుపు తడతాయి. వ్యాపారవేత్తలకు నూతన పరిచయాలు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయి.
కుంభ రాశి :
శని తిరోగమన గమనం కుంభ రాశి వారికి అత్యంత ప్రత్యేకమైనదిగా మారబోతోంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగయ్యే సంకేతాలు ఉన్నాయి. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులు తమ పనితీరుతో యాజమాన్యాన్ని మెప్పించే అవకాశాలు లభిస్తాయి. అయితే, ధనానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు సరికాదు.
మీన రాశి :
మీన రాశిలోనే శని సంచరిస్తుండటంతో ఈ రాశి వారికి రాబోయే 90 రోజులు చాలా కీలకమైనవి. పనుల్లో కొంత ఆలస్యం జరగడం లేదా అదనపు బాధ్యతల భారం వల్ల మానసిక ఆందోళన కలగవచ్చు. కానీ సహనంతో వ్యవహరిస్తే ఎలాంటి పరిస్థితులనైనా చక్కదిద్దవచ్చు. పాత నిర్ణయాలను సమీక్షించుకోవడం, అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి.
మొత్తానికి…. శని తిరోగమన సమయంలో ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతలను నేరుగా ఎదుర్కొని నెరవేర్చాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కాబట్టి కేవలం లాభాల పైనే ఆశలు పెట్టుకోకుండా, చేసే పనిపై, తీసుకునే నిర్ణయాలపై పూర్తి దృష్టి సారించడం చాలా అవసరం. డిసెంబర్ 11 వరకు ఉన్న ఈ 90 రోజుల వ్యవధిని కెరీర్, ఆర్థిక ప్రణాళికల పునఃపరిశీలనకు ఒక మంచి అవకాశంగా మలుచుకోవాలి.