హిందువుల అత్యంత పవిత్రమైన పండుగలలో శారదీయ నవరాత్రులు ఒకటి. శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో కొలిచే ఈ తొమ్మిది రోజులు ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళ్ళాడుతుంది. ఈ ప్రత్యేకమైన మరియు పవిత్రమైన సమయంలో భక్తులు తమ శక్తికొద్దీ అమ్మవారిని పూజిస్తూ, కుటుంబంలో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు మరియు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటారు.

కేవలం పూజలతోనే కాకుండా, నవరాత్రులలో నిరుపేదలకు, ఆకలితో ఉన్నవారికి సేవ చేయడం ద్వారా విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నవరాత్రులలో ప్రతి ఒక్కరూ తమ తమ రాశులకు అనుగుణంగా కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఏ రాశి వారు ఏ రంగు వస్తువులను అమ్మవారికి సమర్పించాలి? ఏయే వస్తువులను దానం చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి? అనే పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశి వారు అమ్మవారికి ఏదైనా ఎరుపు రంగు వస్తువును సమర్పించాలి. అలాగే నలుపు రంగు వస్తువులను దానం చేయడం ద్వారా విశేషమైన ఫలితం ఉంటుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారు నీలం లేదా ఆకుపచ్చ రంగు వస్తువులను దుర్గాదేవికి అలంకరించి, పసుపు రంగు వస్తువులను దానం చేయాలి.
మిథున రాశి
ఇక మిథున రాశికి చెందిన జాతకులు అమ్మవారికి తెలుపు రంగు వస్తువులు లేదా తెల్లని పూలను అర్పించి, ఎరుపు రంగు వస్తువులను దానం చేయడం శుభప్రదం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు అమ్మవారికి ఎరుపు లేదా పసుపు రంగు వస్తువులను సమర్పించాలి. దానం చేసే విషయానికి వస్తే నీలం లేదా నలుపు రంగు వస్తువులను ఎంచుకోవాలి.
సింహ రాశి
{{/usCountry}}కర్కాటక రాశి వారు అమ్మవారికి ఎరుపు లేదా పసుపు రంగు వస్తువులను సమర్పించాలి. దానం చేసే విషయానికి వస్తే నీలం లేదా నలుపు రంగు వస్తువులను ఎంచుకోవాలి.
సింహ రాశి
{{/usCountry}}సింహ రాశి పసుపు లేదా ఎరుపు రంగు వస్తువులను అమ్మకు అర్పించి, నీలం లేదా నలుపు రంగు వస్తువులను దానం చేయాలి.
కన్య రాశి
కన్య రాశి తెలుపు, ఆకుపచ్చ లేదా నీలం రంగుని అమ్మవారికి సమర్పించి, ఎరుపు లేదా పసుపు రంగు వస్తువులను దానం చేయాలని పండితులు సూచిస్తున్నారు.
తులా రాశి
తులా రాశి వారు దుర్గాదేవి చరణాల వద్ద ఆకుపచ్చ లేదా నీలం రంగు వస్తువులను ఉంచాలి. పసుపు రంగు వస్తువుల దానం వీరికి అత్యంత శుభాన్ని తెస్తుంది.
వృశ్చిక రాశి
ఈ రాశి వారు పూజలో ఎరుపు-పసుపు రంగు వస్తువులను సమర్పించి, నలుపు రంగు వస్తువులను దానం చేస్తే సకల కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది.
ధనుస్సు రాశి
ఈ రాశి జాతకులు ఎరుపు-పసుపు రంగు వస్తువులను అమ్మవారికి సమర్పించి, ఎలాంటి నలుపు రంగు వస్తువునైనా దానం చేయవచ్చు.
మకర రాశి
మకర రాశి వారు అమ్మవారికి తెలుపు రంగు వస్తువులను అర్పించి, ఎరుపు రంగు వస్తువులను దానం చేయడం శ్రేయస్కరం.
కుంభ రాశి
తెలుపు లేదా నీలం రంగు వస్తువులను అమ్మకు సమర్పించి, పసుపు రంగు వస్తువులను దానం చేయాలి.
మీన రాశి
మీన రాశి జాతకులు ఎరుపు, పసుపు లేదా తెలుపు రంగు వస్తువులను అమ్మవారికి అలంకరించి, నలుపు రంగు వస్తువులను దానం చేయడం ద్వారా అమ్మవారి కృపకు పాత్రులవుతారు.
ఈ చిన్నపాటి నియమాలను పాటిస్తూ నవరాత్రులను భక్తిభావంతో జరుపుకుంటే మీ జీవితంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.