అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే రోజూ ఈ శివ స్తోత్రం చదవండి!

కార్తీక మాసంలో పరమేశ్వరుడిని పూజించడం ఎంతో విశేషంగా భావిస్తారు. ఈ సమయంలో శివ అష్టోత్తర శతనామావళితో పాటు దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని పఠించడం భక్తులు ఆచరిస్తారు.  

Published on: Nov 24, 2026, 16:08:58 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కార్తీక మాసంలో పరమేశ్వరుడిని ప్రత్యేకించి పూజిస్తారు. కార్తీక మాసంలో శివ అష్టోత్తర శతనామావళిని చదువుకోవడంతో పాటు శివుడికి సంబంధించిన స్తోత్రాలు, శ్లోకాలు, మంత్రాలను కూడా చదువుతూ ఉంటారు. అయితే కచ్చితంగా ఏ దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని చదువుకోవాలి? దారిద్ర దహన శివ స్తోత్రం వలన కలిగే లాభాలేంటి? ఏ విధంగా చదువుకోవాలి? దీనిని ఎప్పుడు చదువుకుంటే మంచిది? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే రోజూ ఈ శివ స్తోత్రం చదవండి! (AI)
అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే రోజూ ఈ శివ స్తోత్రం చదవండి! (AI)

దారిద్ర దహన శివ స్తోత్రం

ఈ స్తోత్రాన్ని బ్రహ్మర్షి వశిష్ఠ మహర్షి రచించారు. ఇది ఒక శక్తివంతమైన శివ ప్రార్థన. దీనిని చదవడం వలన దారిద్ర్యం తొలగిపోతుందని నమ్ముతారు. ఈ స్తోత్రం అర్థం, అంతరార్థం ఏంటి? ప్రతి శ్లోకంలోనూ "దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ" అనే పదం వస్తుంది. దారిద్ర్యం, బాధలను పోగొట్టే శివుడికి నమస్కారం అని దీని అర్థం.

దీనిని చదవడం వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి, అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు. దారిద్ర్యం అంతా తొలగిపోతుంది. అలాగే అజ్ఞానం, భయాలు వంటివి కూడా తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది.

దారిద్ర దహన శివ స్తోత్రం చదవడం వలన కలిగే లాభాలు

స్తోత్రం చదవడం వలన సర్వసంపదలు కలుగుతాయి. ధనధాన్య వృద్ధి కలుగుతుంది. అలాగే సకల రోగాలు, రోగ భయాలు కూడా తొలగిపోతాయట. మనశ్శాంతి పెరుగుతుంది. వంశాభివృద్ధి కూడా కలుగుతుంది. ఇలా అనేక విధాలుగా శుభ ఫలితాలను పొందడానికి వీలవుతుంది.

ఈ స్తోత్రాన్ని ఎప్పుడు చదివితే మంచిది?

ఈ స్తోత్రాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడైనా చదువుకోవచ్చు. లేదా ప్రతి రోజూ పూజ చేసుకునేటప్పుడు కూడా చదువుకోవచ్చు. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. పైన చెప్పిన లాభాలన్నింటినీ కూడా పొందడానికి వీలవుతుందని నమ్ముతారు.

ఈ స్తోత్రాన్ని కార్తీక మాసంలో చదువుకుంటే కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సోమవారాలు, మహాశివరాత్రి, మాస శివరాత్రి, ప్రదోష వ్రతం వంటి పర్వదినాల్లో కూడా దీనిని చదువుకోవచ్చు. శివుడికి అభిషేకం చేశాక కూడా చదువుకోవచ్చు.

దారిద్ర దహన శివ స్తోత్రం

విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ

కర్ణామృతాయ శశిశేఖరధారణాయ

కర్పూరకాంతిధవలాయ జటాధరాయ

దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ..

గౌరీప్రియాయ రజనీశకలాధరాయ

కాలాంతకాయ భుజగాధిపకంకణాయ

గంగాధరాయ గజరాజవిమర్దనాయ

దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ..

భక్తిప్రియాయ భవరోగభయాపహాయ

ఉగ్రాయ దుఃఖభవసాగరతారణాయ

జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ

దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ..

చర్మాంబరాయ శవభస్మవిలేపనాయ

ఫాలేక్షణాయ మణికుండలమండితాయ

మంజీరపాదయుగళాయ జటాధరాయ

దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ..

పంచాననాయ ఫణిరాజవిభూషణాయ

హేమాంశుకాయ భువనత్రయమండితాయ

ఆనందభూమివరదాయ తమోమయాయ

దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ..

గౌరీవిలాసభవనాయ మహేశ్వరాయ

పంచాననాయ శరణాగతకల్పకాయ

శర్వాయ సర్వజగతామధిపాయ తస్మై

దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ..

భానుప్రియాయ భవసాగరతారణాయ

కాలాంతకాయ కమలాసనపూజితాయ

నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ

దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ..

రామప్రియాయ రఘునాథవరప్రదాయ

నాగప్రియాయ నరకార్ణవతారణాయ

పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ

దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ..

ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ

గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ

మాతంగచర్మవసనాయ మహేశ్వరాయ

దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ..

వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వదారిద్ర్యనాశనమ్

సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనమ్..

ABOUT THE AUTHOR

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు