సింహరాశిలోకి శుక్రుడి సంచారం - ఆగస్టు 1 వరకు ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు
సింహరాశిలో శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశుల జాతకులు విశేష లాభాలు పొందనున్నారు. ఆగస్టు 1 వరకు పలు రాశుల వారికి అదృష్టం వరించనుంది.
జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల కదలికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా సంపద, వైభవం, లగ్జరీ జీవితానికి కారకుడైన శుక్రుడి రాశి మార్పు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం శుక్రుడు సూర్యుడికి అధిపతి అయిన సింహరాశిలో సంచరిస్తున్నాడు.

హిందూ క్యాలెండర్ ప్రకారం….. ఆగస్టు 1వ తేదీ ఉదయం వరకు శుక్రుడు ఇదే రాశిలో కొనసాగుతాడు. దీనికి తోడు సింహ రాశిలో కేతువుతో శుక్రుడి కలయిక కూడా జరగనుంది. ఈ గ్రహాల కలయిక వల్ల రాబోయే రోజుల్లో కొన్ని రాశుల వారికి ఊహించని ఆర్థిక లాభాలు, శుభవార్తలు అందుతాయని జ్యోతిష్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.
"సింహరాశిలో శుక్రుడి గోచారం కారణంగా రాబోయే 18 రోజుల్లో కొన్ని రాశుల వారికి అపారమైన ధనలాభం కలిగే అవకాశం ఉంది," అని ప్రముఖ జ్యోతిష్కుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వృషభం, కన్య, తుల, వృశ్చికం, మీన రాశులతో పాటు సింహ రాశి జాతకులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా మారనుంది.
వృషభ రాశి :
వృషభ రాశి జాతకులకు ఈ కాలం అన్ని విధాలా కలిసివస్తుంది. కుటుంబ సభ్యులు, పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. గతంలో ఆస్తులపై పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఇది మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది.
తులారాశి :
తులారాశి వారికి ఈ గోచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు, హోదా పెరుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారవేత్తలు భారీ లాభాలను ఆర్జించడానికి ఇది సువర్ణావకాశం.
వృశ్చిక రాశి :
వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి లాభాల బాట పడతారు. ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఈ ప్రయాణాలు సఫలమవుతాయి. ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మీన రాశి :
మీన రాశి వారికి ఈ సమయం అద్భుతంగా ఉండబోతోంది. కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాల్లో మీకు అనుకూల తీర్పులు వస్తాయి. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుని సకాలంలో పూర్తవుతాయి.
కన్యా రాశి :
కన్యా రాశి జాతకులకు పట్టిన ఆర్థిక కష్టాలు క్రమంగా తొలగిపోతాయి. ధన ప్రవాహం పెరిగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం మెరుగుపడి, ఆమె వైపు నుంచి శుభవార్తలు వింటారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

