శ్రావణ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్ర మాసాల్లో ఒకటి. ప్రాంతాన్ని బట్టి శ్రావణమాసం తేదీలు, ఆచారాలు మారుతూ ఉంటాయి. తెలుగు పంచాంగం సాంప్రదాయం ప్రకారం చూసినట్లయితే, ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రావణమాసం ఉంది.

శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. శ్రావణ మాసంలో శివుడిని కూడా ప్రత్యేకించి ఆరాధిస్తారు. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ కూడా చాలా విశేషమైనది. శ్రావణ మాసంలో చేయాల్సిన పరిహారాలు, శ్రావణ మాసంలో పాటించాల్సిన నియమాలతో పాటుగా పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రావణ మాసం 2026 ప్రాధాన్యత, పూజా విధానం, పరిహారాలు
శివ పూజ
శ్రావణ మాసంలో శివుడిని ఆరాధించడం వలన విశేష ఫలితాలు కలుగుతాయి. శివుడికి సమర్పించి, ఓం నమ: శివాయ మంత్రాన్ని జపిస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అలాగే సోమవారాలను శివారాధనకు ప్రత్యేకంగా భావించే సాంప్రదాయం కూడా ఉంది.
శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం, నాగ పంచమి, శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, లక్ష్మీ పూజ, రక్షాబంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి లాంటి పర్వదినాలు వస్తాయి. దీంతో శ్రావణమాసం అంతా కలకల్లాడుతూ ఉంటుంది. ఆడపడుచులు అందంగా అలంకరణ చేసుకుని ఆ అమ్మవారిని ఇష్టంగా పూజిస్తారు.
శ్రావణ సోమవారం ఎలా పూజ చేయాలి?
శ్రావణ సోమవారం నాడు తలస్నానం చేసి, శుభ్రమైన దుస్తులను ధరించి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. శివలింగాన్ని శుభ్రంగా ఉంచి అభిషేకం చేయాలి. నీళ్లతో అభిషేకం చేయడంతో పాటుగా పాలు, పెరుగు, తేనె వంటివి సమర్పించవచ్చు. పండ్లు, పుష్పాలు, నైవేద్యాన్ని కూడా సమర్పించండి.
శ్రావణ శుక్రవారం పూజ
శ్రావణ శుక్రవారం ఉన్న ప్రాముఖ్యత గురించి విశేషంగా చెప్పక్కర్లేదు. ఇంటిని శుభ్రంగా ఉంచుకొని, పూజ మందిరాన్ని అలంకరించుకుని లక్ష్మీదేవిని ప్రతిష్టించి పూజ చేయాలి. అలాగే కలశాన్ని ఏర్పాటు చేసుకుని లక్ష్మీదేవి పూజ చేసి అష్టోత్తరం చదువుకోవాలి. నైవేద్యం, హారతి, వ్రతకథ పఠనం ఇలా విధానాన్ని పాటిస్తూ భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించాలి.
శ్రావణ మాసంలో చేయాల్సిన పరిహారాలు
1.శివ పంచాక్షరి జపం:
{{/usCountry}}శ్రావణ శుక్రవారం ఉన్న ప్రాముఖ్యత గురించి విశేషంగా చెప్పక్కర్లేదు. ఇంటిని శుభ్రంగా ఉంచుకొని, పూజ మందిరాన్ని అలంకరించుకుని లక్ష్మీదేవిని ప్రతిష్టించి పూజ చేయాలి. అలాగే కలశాన్ని ఏర్పాటు చేసుకుని లక్ష్మీదేవి పూజ చేసి అష్టోత్తరం చదువుకోవాలి. నైవేద్యం, హారతి, వ్రతకథ పఠనం ఇలా విధానాన్ని పాటిస్తూ భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించాలి.
శ్రావణ మాసంలో చేయాల్సిన పరిహారాలు
1.శివ పంచాక్షరి జపం:
{{/usCountry}}ప్రతి రోజు ఓం నమశ్శివాయ మంత్రాన్ని భక్తితో జపించండి. ఆధ్యాత్మిక సాధనగా చేయొచ్చు.
2.బిల్వదళాల సమర్పణ:
శివారాధనలో బిల్వదళాలకు ప్రత్యేక స్థానం. ప్రతి సోమవారం శివుడికి బిల్వదళాలను సమర్పించండి.
3.నిత్యం దీపారాధన:
సాయంత్రం పూజా మందిరంలో దీపాన్ని వెలిగించి, కాసేపు ధ్యానం చేస్తే చాలా మంచిది.
4.అన్నదానం:
సామర్థ్యానికి తగ్గట్టుగా పేదలకు, అవసరమైన వారికి ఆహారాన్ని అందించండి.
ఉదయం స్నానం చేసి, పూజ స్థలాన్ని శుభ్రంగా చేసుకొని, దీపం వెలిగించి ఇష్టదైవాన్ని ఆరాధించండి. సాయంత్రం కూడా దీపం వెలిగించి ఓం నమశ్శివాయ మంత్రాన్ని జపించండి. శివుడు లేదా లక్ష్మీదేవిని ఆరాధించండి. రోజూ ఎక్కువ సమయం కేటాయించలేకపోయినా, భక్తి శ్రద్ధలతో చిన్న పూజ చేసుకున్నా మంచి ఫలితం వస్తుంది.