హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసం కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా, జ్యోతిష్య శాస్త్రం పరంగా కూడా ఈసారి ఎంతో ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఈ పవిత్ర మాసంలో అనేక గ్రహాలు తమ గమనాన్ని మరియు రాశులను మార్చబోతున్నాయి. బుధుడి తాత్కాలిక సంచారం, శుక్ర, అంగారక (కుజ) గ్రహాల రాశి పరివర్తనం, నెల మధ్యలో సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించడం వంటి కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. అదే సమయంలో శని గ్రహం శ్రావణ మాసమంతా తిరోగమనంలోనే పయనిస్తుంది.

ఈ అరుదైన గ్రహాల కదలికలు మొత్తం 12 రాశులపై తమ ప్రభావాన్ని చూపుతాయి. అయితే…. ఈ శ్రావణ మాసంలో చోటుచేసుకునే గ్రహాల మార్పుతో ప్రధానంగా 6 రాశుల వారికి అత్యంత శుభఫలాలు అందుతాయని ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ వెల్లడించారు. మేషం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండబోతోంది.
- మేష రాశి : ఈ రాశి వారికి శ్రావణ మాసం అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో కొత్త బాధ్యతలు దక్కుతాయి. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. లీగల్‌గా లేదా ఇతర రూపాల్లో నిలిచిపోయిన పాత బాకీలు, డబ్బులు తిరిగి చేతికి అందుతాయి.
- కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈ మాసం తీవ్ర ఉపశమనాన్ని కలిగిస్తుంది. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. ఉద్యోగంలో మీరు పడే కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే గణనీయంగా మెరుగుపడుతుంది.
- సింహ రాశి : ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కెరీర్‌లో ఊహించని పురోగతిని సాధిస్తారు. ఉన్నతాధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు, ప్రణాళికలు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం.
- తుల రాశి : ఆర్థికపరంగా, కెరీర్ పరంగా తులా రాశి వారికి అనేక శుభవార్తలు అందుతాయి. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
- వృశ్చిక రాశి : ఈ రాశి వారు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో లాభాలు పుంజుకుంటాయి. పాత వివాదాలు, కోర్టు సమస్యలు సమసిపోతాయి.
- ధనుస్సు రాశి : ఈ రాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది. కొత్త ఉద్యోగం, సుదూర ప్రయాణాలు లేదా నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి యోగం ఉంది. ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలు లభిస్తాయి.
"శ్రావణ మాసంలో పరమశివుడిని నిష్టతో ఆరాధించడం, రోజూ శివలింగానికి జలాభిషేకం చేయడం, మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. శివానుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి" అని ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ స్పష్టం చేశారు.
{{/usCountry}}"శ్రావణ మాసంలో పరమశివుడిని నిష్టతో ఆరాధించడం, రోజూ శివలింగానికి జలాభిషేకం చేయడం, మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. శివానుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి" అని ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ స్పష్టం చేశారు.
{{/usCountry}}