జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడి నక్షత్ర సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. జూన్ 8న సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. జూన్ 22 వరకు సూర్యుడు ఇదే నక్షత్రంలో ఉంటాడు. ఈ 14 రోజుల పాటు సూర్యుడి అనుగ్రహంతో కొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోనున్నాయి. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి పట్టిన ఇబ్బందులు వదిలిపోయి, నిలిచిపోయిన పనులన్నీ వేగంగా పూర్తి అవుతాయి. ఆ రాశుల వివరాలు, వారు పొందబోయే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.
మృగశిరలో సూర్యుడు.. ఎలాంటి మార్పులు వస్తాయి?

కుజ గ్రహానికి చెందిన మృగశిర నక్షత్రంలోకి సూర్యుడు రావడం వల్ల సమాజంలో ఒక కొత్త ఉత్తేజం కనిపిస్తుంది. "ఈ సమయంలో ప్రజల్లో సరికొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి, ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతాయి," అని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వివరించారు. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి ఈ గోచారం అద్భుతమైన విజయాలను అందిస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో పెద్ద ఎత్తున లాభాలు సాధిస్తారు.
1.వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ నక్షత్ర మార్పు ఒక శుభ సంకేతం. సమాజంలో మీ మాటతీరుకు గౌరవం పెరుగుతుంది. దీనివల్ల మీ కీర్తిప్రతిష్టలు రెట్టింపు అవుతాయి. ఉద్యోగం చేసే వారికి పైఅధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగవుతుంది. వ్యాపారస్తులకు ఈ సమయంలో భారీగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
2.సింహ రాశి
సూర్యుడు సింహ రాశికి అధిపతి. అందుకే ఈ గోచారం వల్ల సింహ రాశి వారికి అన్ని రంగాల్లోనూ తిరుగులేని విజయాలు అందుతాయి. కెరీర్ లో ముందుకు దూసుకెళ్లడానికి అద్భుతమైన అవకాశాలు తలుపు తడతాయి. ఉద్యోగం మారాలని చూస్తున్న వారికి ఈ రెండు వారాల్లో మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ జీవితం హాయిగా సాగిపోతుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. కాస్త ఓపికతో వ్యవహరిస్తే మరిన్ని లాభాలు మీ సొంతమవుతాయి.
3.మకర రాశి
మకర రాశి వారికి కూడా సూర్యుడి మార్పు మంచి ఫలితాలను ఇస్తుంది. కళలు, సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ రోజుల్లో చేసే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెడతాయి. జూన్ 8 నుంచి 22 మధ్య మీడియా, మార్కెటింగ్ రంగాల వారికి ఊహించని గుర్తింపు లభిస్తుంది. భాగస్వామితో బంధం బలపడుతుంది. మీలో ఆత్మవిశ్వాసం మునుపటి కంటే పెరుగుతుంది.
4.ధనుస్సు రాశి
{{/usCountry}}మకర రాశి వారికి కూడా సూర్యుడి మార్పు మంచి ఫలితాలను ఇస్తుంది. కళలు, సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ రోజుల్లో చేసే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెడతాయి. జూన్ 8 నుంచి 22 మధ్య మీడియా, మార్కెటింగ్ రంగాల వారికి ఊహించని గుర్తింపు లభిస్తుంది. భాగస్వామితో బంధం బలపడుతుంది. మీలో ఆత్మవిశ్వాసం మునుపటి కంటే పెరుగుతుంది.
4.ధనుస్సు రాశి
{{/usCountry}}ధనుస్సు రాశి వారి జీవితాల్లో ఈ గోచారం సానుకూల మార్పులను తీసుకువస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి శుభవార్తలు అందుతాయి. ఒంటరిగా ఉన్న వారికి నచ్చిన భాగస్వామి లభించే అవకాశం ఉంది. వివాహితుల మధ్య చిన్నచిన్న విభేదాలు వచ్చినప్పటికీ, పరస్పర అవగాహనతో బంధం మరింత గట్టిపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.
జూన్ 8 నుంచి 22 వరకు చేయాల్సిన పరిహారాలు
సూర్యుడి అనుగ్రహం పూర్తిగా కలగాలంటే ఈ రోజుల్లో కొన్ని చిన్న పరిహారాలు చేయడం మంచిది. ప్రతిరోజూ ఉదయాన్నే రాగి పాత్రలో నీటిని తీసుకుని సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇంట్లోని పెద్దలను గౌరవించాలి. ఆదివారం నాడు నిరుపేదలకు తోచన దానం చేయడం వల్ల సూర్య దోషాలు తొలగిపోతాయి. ఈ సమయంలో కోపాన్ని, అహకారాన్ని వీడటం ఎంతో ముఖ్యం. ఓపికతో ఉంటేనే అనుకున్న పనులు సజావుగా సాగుతాయి.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, జ్యోతిష్య ఆధారంగా రాసినది మాత్రమే. దీనిని పూర్తిగా ధృవీకరించడం లేదు. మరింత సమాచారం కోసం సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.