Sun Transit: జూన్ 15తో ఈ రాశుల వారి సమస్యలు అన్నింటికీ స్వస్తి.. విలాసాలు, ధన లాభంతో పాటు ఎన్నో!
జూన్ 15న సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల ఏర్పడే మిథున సంక్రాంతి ప్రభావంతో మేషం, మిథునంతో పాటు మరో రెండు రాశుల వారికి ఆర్థిక లాభాలు, కెరీర్‌లో అద్భుతమైన పురోగతి లభిస్తాయి.
గ్రహాల రాజు సూర్య భగవానుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతుంటాడు. జ్యోతిష్య శాస్త్రంలో ఈ మార్పును 'సంక్రాంతి' అని పిలుస్తారు. ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్న సూర్యుడు, 2026 జూన్ 15వ తేదీన మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యుడిని ఆత్మ, తండ్రి, ధైర్యానికి కారకుడిగా భావిస్తారు. ఈ రాశి మార్పు ప్రభావం మొత్తం 12 రాశుల పైనా కనిపిస్తుంది.

"సూర్యుడి మిథున రాశి ప్రవేశం వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని విధంగా కెరీర్‌లో ఎదుగుదల, ఆర్థిక లాభాలు, ఆరోగ్య పరమైన ఉపశమనం లభించనున్నాయి," అని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వివరించారు. ఈ క్రమంలో ఏయే రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోందో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి
మేష రాశి వారికి సూర్యుడి గోచార మార్పు ఎంతో మేలు చేస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. సమాజంలో కీలకమైన నిర్ణయాలు తీసుకొని విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగవుతుంది. కుటుంబ సభ్యులు, బంధువులతో ఉన్న విభేదాలు తొలగిపోయి బంధాలు బలపడతాయి. ప్రభుత్వ రంగం నుంచి ఆశించిన ప్రయోజనాలు అందుతాయి. సూర్య దేవుడి అనుగ్రహంతో సొంత ఇల్లు, భూమి లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. సన్నిహితుల మద్దతుతో పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. అదృష్టం కలిసి వచ్చి నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి.
మిథున రాశి
సూర్యుడి సంచారం మీ సొంత రాశిలోనే జరుగుతోంది. దీనివల్ల మీలో నాయకత్వ లక్షణాలు అద్భుతంగా మెరుగవుతాయి. సమాజంలో, ఆఫీసులో మీరు చెప్పే మాటలకు, అభిప్రాయాలకు ఇతరులు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల కెరీర్‌లో మంచి అవకాశాలు లభిస్తాయి. అయితే, మాట్లాడేటప్పుడు కాస్త ఓపిక, సంయమనం పాటించడం అవసరం. మానసిక ఒత్తిడి తగ్గి, మునుపటి కంటే ఎక్కువ ఉత్సాహంతో పని చేస్తారు. భౌతిక సుఖాలు, విలాసవంతమైన వస్తువులు సమకూరుతాయి.
సింహ రాశి
సింహ రాశి వారికి సూర్యుడి గోచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ఆశించిన దానికంటే మంచి లాభాలు అందుతాయి. దీనివల్ల ఆర్థికంగా స్థిరపడతారు. మీరు పడే కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సమయం ఆసన్నమైంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించడమే కాకుండా కొత్త బాధ్యతలు దక్కుతాయి. వ్యాపారులకు ఈ సమయం లాభాల పంట పండిస్తుంది. సామాజికంగా మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మకర రాశి
మకర రాశి వారికి సూర్య సంచారం ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గత కొన్ని రోజులుగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు క్రమంగా నయమవుతాయి. ఉద్యోగం, వ్యాపార రంగాలలో మీ స్థానం మరింత బలోపేతం అవుతుంది. శ్రమకు తగిన పూర్తి ఫలితాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం కలగడం వల్ల ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి.
సూర్య అనుగ్రహం కోసం చేయాల్సిన పరిహారాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడి కృపను పొందడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించవచ్చు. ప్రతిరోజూ ఉదయాన్నే ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. ఆదివారం రోజున గోధుమలు, బెల్లం, ఎరుపు రంగు వస్త్రాలు, ఎర్ర చందనం వంటివి దానం చేయడం వల్ల జాతకంలో సూర్య దోషాలు తొలగిపోయి అనుకూలత పెరుగుతుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం జ్యోతిష్య నిపుణుల అభిప్రాయాలు, శాస్త్రాల ఆధారంగా ఇచ్చిందే. దీనిని పూర్తిగా ధృవీకరించడం లేదు. మరింత సమాచారం కోసం సంబంధిత రంగ నిపుణులను సంప్రదించగలరు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


