వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల రాజుగా భావించే సూర్యభగవానుడు త్వరలోనే తన స్థానాన్ని మార్చుకోనున్నాడు. ప్రస్తుతం శుక్రుడికి చెందిన తులారాశిలో సంచరిస్తున్న సూర్యుడు….. నవంబర్ 16వ తేదీన కుజుడి (అంగారకుడు) స్వక్షేత్రమైన వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. అక్టోబర్ 17 నుంచి తులారాశిలో ఉన్న సూర్యుడు….. వృశ్చిక రాశిలోకి అడుగుపెట్టి సుమారు ఒక నెల రోజుల పాటు అదే రాశిలో కొలువుదీరనున్నాడు. ఆ తర్వాత ధనూ రాశిలోకి తన ప్రయాణాన్ని సాగిస్తాడు.

వృశ్చిక రాశిలో సూర్యుడు సంచరించే ఈ ఒక నెల కాలం మొత్తం 8 రాశుల వారిపై విశేషమైన దయాదృష్టిని నిలుపనున్నాడని ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపారు. ఈ నవంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే సూర్య సంచారం వల్ల ఏ ఏ రాశుల వారికి ఎలాంటి శుభ ఫలితాలు, సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయో వివరంగా తెలుసుకుందాం….
వృషభ రాశి:
సూర్యుడి గోచార మార్పు వృషభ రాశి వారికి అద్భుతమైన మార్పులను తీసుకువస్తుంది. ఈ రాశి వారికి ఈ సమయం అత్యంత శుభప్రదంగా మారనుంది. వ్యాపారంలో ఉన్నవారు లేదా ఉద్యోగస్తులు కొత్త ప్రాజెక్టులు, పనులను ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారి కల నెరవేరుతుంది. సూర్యుని తేజస్సు వల్ల సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఊహించని లాభాలు అందుతాయి.
మిథున రాశి:
కుజుడి రాశిలోకి సూర్యుడు రావడం మిథున రాశి అభ్యర్థులకు ఒక గొప్ప వరంగా మారనుంది. కెరీర్ పరంగా ఈ రాశి వారు అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. అయితే, చేపట్టే ప్రతి పనిని పూర్తి బాధ్యతతో, సీరియస్గా పూర్తి చేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగ్గా మారి, ధన లాభాలు చేకూరతాయి.
కన్యా రాశి:
కన్యా రాశి వారికి ఈ సంచారం అన్ని రకాలుగా కలిసి వస్తుంది. కెరీర్లో అద్భుతమైన అవకాశాలు తలుపు తడతాయి. వ్యాపారవేత్తలకు ఆర్థిక స్థితిని బలపరిచే పెద్ద కాంట్రాక్టులు లేదా ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలో, ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
తులా రాశి:
{{/usCountry}}కన్యా రాశి వారికి ఈ సంచారం అన్ని రకాలుగా కలిసి వస్తుంది. కెరీర్లో అద్భుతమైన అవకాశాలు తలుపు తడతాయి. వ్యాపారవేత్తలకు ఆర్థిక స్థితిని బలపరిచే పెద్ద కాంట్రాక్టులు లేదా ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలో, ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
తులా రాశి:
{{/usCountry}}సూర్యుడు వృశ్చిక రాశిలోకి అడుగుపెట్టడంతో తులా రాశి వారి కష్టాలు తొలగిపోతాయి. ప్రస్తుతం తమ సొంత రాశిలో సూర్యుడు ఉన్నందున ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఈ మార్పుతో నిలిచిపోయిన పనులన్నీ మళ్లీ వేగం పుంజుకుంటాయి. చిక్కుల్లో ఉన్న ఆర్థిక వ్యవహారాలు సర్దుమనిగి, ఆర్థిక పునాది దృఢపడుతుంది.
వృశ్చిక రాశి:
సూర్యుడు స్వయంగా ఈ రాశిలోనే సంచరించనుండటంతో వృశ్చిక రాశి వారికి బహుళ ప్రయోజనాలు చేకూరుతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు విరివిగా ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన లాభం కలుగుతుంది. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. ఏదైనా శుభవార్త వినడం వల్ల మనస్సుకు ఎంతో నిండైన సంతోషం లభిస్తుంది.
మకర రాశి:
శనిదేవుడికి చెందిన మకర రాశిపై కూడా సూర్య సంచార ప్రభావం అత్యంత అనుకూలంగా ఉంటుంది. గతంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులు తొలగిపోతాయి. భాగస్వామితో లేదా సంబంధాల్లో ఏవైనా విభేదాలు ఉంటే అవి తొలగిపోయి సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక స్థితిగతులు గతం కంటే మెరుగ్గా మారుతాయి.
కుంభ రాశి:
కుంభ రాశి వారికి సూర్య గోచారం వల్ల అపారమైన ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. సంతానం నుంచి ఏదైనా శుభవార్త అందుకోవడం వల్ల కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. వ్యాపార రంగానికి చెందిన వారికి రాబోయే కాలం లాభదాయకంగా ఉండబోతోంది.
మీన రాశి:
సూర్యుడి ప్రవేశం మీన రాశి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుంది. మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు తొలగిపోయి, తలపెట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.