సూర్య సంచారంతో బంగారు రోజులు.. ఈ 6 రాశుల వారికి భారీ లాభాలు!

ఆగస్టు 17, 2026న సూర్య భగవానుడు తన స్వరాశి అయిన సింహరాశిలోకి ప్రవేశించనున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గోచారం అన్ని రాశులపై ప్రభావం చూపనున్నప్పటికీ, ముఖ్యంగా మేష, కర్కాటక, సింహ, కన్య, తులా, వృశ్చిక రాశుల వారికి అత్యంత శుభఫలితాలు అందించనుంది. 

Published on: Aug 2, 2026, 13:18:44 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడిని గ్రహాల రాజుగా కొలుస్తారు. ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ప్రభుత్వ ఉద్యోగం, కీర్తి ప్రతిష్టలకు కారకుడైన సూర్యుడు తన సొంత రాశి అయిన సింహంలోకి అడుగుపెట్టబోతున్నాడు. రాబోయే ఆగస్టు 17, 2026 న ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది.

సూర్య సంచారంతో బంగారు రోజులు.. ఈ 6 రాశుల వారికి భారీ లాభాలు!
సూర్య సంచారంతో బంగారు రోజులు.. ఈ 6 రాశుల వారికి భారీ లాభాలు!

గ్రహాల రాశి మార్పు మానవ జీవితాలపై, వివిధ రాశుల జాతకులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పండిత్ నరేంద్ర ఉపాధ్యాయ్ విశ్లేషణ ప్రకారం, ఈ సూర్య గోచార ప్రభావం ద్వాదశ రాశులపై ఉన్నప్పటికీ.. ముఖ్యంగా ఆరు రాశుల వారికి ఇది అద్భుతమైన కాలంగా మారనుంది. ఉద్యోగంలో పురోగతి, ఆర్థిక లాభాలు, సమాజంలో గుర్తింపు కోరుకునే వారికి ఈ సమయం కలిసొస్తుంది. ఆ ఆరు అదృష్ట రాశుల వివరాలు ఇలా ఉన్నాయి.

మేష రాశి

మేష రాశి వారికి సూర్య సంచారం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ రంగంలో కీలక బాధ్యతలు మీ చేతికి వస్తాయి. ప్రమోషన్ లేదా వేతన పెంపునకు సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు ఆర్జిస్తారు. గతంలో నిలిచిపోయిన పనులను మళ్ళీ విజయవంతంగా పూర్తి చేస్తారు. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు అనుకూల ఫలితాలు వస్తాయి.

కర్కాటక రాశి

ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న కర్కాటక రాశి వారికి ఈ గోచారం చక్కటి ఉపశమనాన్ని ఇస్తుంది. సంపాదన మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. గతంలో చేసిన పెట్టుబడుల ద్వారా మంచి రాబడులు అందుకుంటారు. ఆఫీసులో పైఅధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు ఒక్కటొడిగా తొలగిపోతాయి.

సింహ రాశి

సూర్యుడు తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశిస్తుండటంతో ఈ రాశి వారికి ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. మీ వ్యక్తిత్వంలో ప్రత్యేకమైన తేడా కనిపిస్తుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు ఊహించని స్థాయిలో పెరుగుతాయి. ప్రభుత్వ రంగంలో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా కెరీర్‌లో భారీ మైలురాళ్లను అందుకునే అద్భుత అవకాశం ఉంది. మీ నాయకత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకుంటాయి.

కన్యా రాశి

కన్యా రాశి జాతకులకు ఈ కాలం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అనవసర ఖర్చులపై పట్టు సాధిస్తారు. విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రాంతాలకు సంబంధించిన వ్యవహారాలు విజయవంతంగా ముగుస్తాయి. ఉద్యోగం మరియు వ్యాపారంలో సానుకూల మార్పులు ప్రారంభమవుతాయి. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తే మంచి ఫలితాలు మీ సొంతమవుతాయి.

తులా రాశి

తులా రాశి వారికి ఆదాయం గణనీయంగా వృద్ధి చెందుతుంది. పాత పెట్టుబడుల నుంచి భారీ లాభాలు కళ్లజూస్తారు. మిత్రులు, సమాజంలోని ప్రముఖుల సహకారంతో కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. ఎప్పటినుంచో వాయిదా పడుతున్న పనులు ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల మద్దతుతో మానసిక బలం పెరుగుతుంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి కెరీర్ పరంగా ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరగడంతో పాటు హోదాకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త మార్గాలు దొరుకుతాయి. తండ్రి వైపు నుంచి సహకారం, శుభవార్తలు అందుకుంటారు. సంఘంలో మీకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతుంది.

సూర్య సంచారం ప్రాముఖ్యత ఏమిటి?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు, ఆత్మకారకుడు. నాయకత్వ పటిమ, పితృ సంబంధ అంశాలు, ప్రభుత్వ సంబంధమైన లాభాలను సూర్య భగవానుడి అనుగ్రహం నిర్ణయిస్తుంది. సింహరాశి సూర్యుడికి అత్యంత ప్రియమైన ఇల్లు కావడం వల్ల, ఈ కాలంలో ఆయన శక్తి పూర్తి స్థాయిలో ఉంటుంది. దీనివల్ల పైన పేర్కొన్న రాశుల వారికి సానుకూల ఫలితాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More