సూర్యగ్రహణం వేళ చతుర్గ్రహి యోగం - ఈ 4 రాశుల జాతకం మారనుంది, అదృష్టం మీ వెంటే..!

ఆగస్టు 12న ఏర్పడుతున్న సూర్యగ్రహణం వేళ కర్కాటక రాశిలో రూపుదిద్దుకుంటున్న అరుదైన చతుర్గ్రహి యోగంతో  మేష, మిథున, సింహ, ధనుస్సు రాశులపై ప్రభావం చూపనుంది. అపారమైన ధనలాభం, ఉద్యోగాల్లో పురోగతి కలగనున్నాయి. 

Published on: Aug 12, 2026, 12:06:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆగస్టు 12, 2026 బుధవారం రోజున శ్రావణ అమావాస్య (హరియాళీ అమావాస్య) పవిత్ర పర్వదినాన ఈ సంవత్సరపు చివరి సూర్యగ్రహణం సంభవిస్తోంది. ఖగోళ శాస్త్రపరంగానే కాకుండా జ్యోతిష్య శాస్త్ర రీత్యా కూడా ఈ గ్రహణానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ గ్రహణ సమయంలో ఒకే రాశిలో నాలుగు ప్రధాన గ్రహాలు కలవడం వల్ల ఎంతో శక్తివంతమైన, అరుదైన 'చతుర్గ్రహి యోగం యోగం' ఏర్పడుతోంది.

కర్కాటకంలో చతుర్గ్రహీ యోగం
కర్కాటకంలో చతుర్గ్రహీ యోగం

ఖగోళ గణాంకాల ప్రకారం ఈ సూర్యగ్రహణం భారతీయ కాలమానం ప్రకారం ఆగస్టు 13న రాత్రి 09:04 గంటలకు ప్రారంభమై, అర్ధరాత్రి దాటిన తర్వాత 01:27 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో దృశ్యమానం కాకపోవడం వల్ల ఇక్కడ సూతక్ కాలం వర్తించదని ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ స్పష్టం చేశారు.

కర్కాటకంలో గ్రహాల మహా కూటమి…

ఈ సూర్యగ్రహణం సమయంలో కర్కాటక రాశిలో సూర్యుడు, బుధుడు, బృహస్పతి (గురువు), చంద్రుడు ఒకే చోట కొలువుదీరి చతుర్గ్రహి యోగం యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ముఖ్యంగా దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండటం ఈ యోగం యొక్క ప్రాధాన్యతను మరింత పెంచింది. ఈ శుభప్రదమైన గ్రహాల కలయిక ద్వాదశ రాశులపైనా తీవ్ర ప్రభావం చూపినప్పటికీ, నాలుగు రాశుల వారికి మాత్రం ఊహించని ధన యోగాన్ని, విజయాలను అందించబోతోంది. ఆ అదృష్ట రాశుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

1. మేష రాశి

సూర్యగ్రహణంతో ఏర్పడే ఈ చతుర్గ్రహీ యోగం మేష రాశి వారికి అత్యంత అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో అద్భుతమైన పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు, మొండి బాకీలు సులువుగా పూర్తవుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతి (ప్రమోషన్) లభించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కొత్త ఆర్థిక వనరులు సమకూరి బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. కోరుకున్న ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశం లభిస్తుంది.

2. మిథున రాశి

మిథున రాశి వారికి ఈ సమయం అదృష్టాన్ని, సంతోషాన్ని మోసుకొస్తుంది. జీవితంలో ఆనందం గణనీయంగా పెరుగుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయం. పాత మార్గాల నుంచే కాకుండా కొత్త మార్గాల ద్వారా కూడా రాబడి పెరుగుతుంది. పాత అప్పుల నుంచి ఉపశమనం లభించి ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు తొలిగి, పెద్దల ఆస్తులు కలసివచ్చే సూచనలు ఉన్నాయి.

3. సింహ రాశి

సింహ రాశికి అధిపతి సూర్యభగవానుడు. కర్కాటకంలో ఏర్పడే చతుర్గ్రహీ యోగం వల్ల సింహ రాశి వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు రెట్టింపు అవుతాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి సువర్ణ అవకాశాలు లభిస్తాయి. పెద్ద ఒప్పందాలు (డీల్స్) లేదా కాంట్రాక్టులపై సంతకాలు చేస్తారు. విధి నిర్వహణలో మీ నాయకత్వ పటిమకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతితో పాటు ఆదాయం విశేషంగా పెరుగుతుంది.

4. ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి చతుర్గ్రహీ యోగం అదృష్ట యోగాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సంబంధిత కార్యక్రమాలపై ఆసక్తి పెరిగి, మతపరమైన పూజలు మరియు ప్రయాణాల్లో పాల్గొంటారు. మీరు చేసే ప్రయాణాలు వ్యాపారరీత్యా, వ్యక్తిగతంగా అత్యంత ఫలవంతమైన ఫలితాలను ఇస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలం; వారు ఆశించిన విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా బలపడుతుంది.

సాధారణంగా గ్రహణం అనేది ప్రతికూల వాతావరణాన్ని, నెగెటివ్ వైబ్రేషన్లను కలిగిస్తుందని పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపారు. అందుకే ఈ సమయంలో అనవసర వాదనలకు…. గొడవలకు దూరంగా ఉండాలి. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఇష్టదైవాన్ని స్మరిస్తూ, నామ జపం లేదా మంత్ర పఠనం చేయడం వల్ల సకల దోషాలు తొలగిపోయి, మనశ్శాంతి చేకూరుతుందని పండితులు సూచిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More