భార్యాభర్తల బంధాన్ని బలంగా మార్చే 3 సూత్రాలు ఇవే.. శ్రీమద్భాగవతం చెప్పిన గొప్ప సందేశం!

వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? శ్రీమద్భాగవతం ప్రకారం పరస్పర గౌరవం, నమ్మకం, విశ్వాసం అనే మూడు సూత్రాలు దాంపత్య బంధాన్ని బలపరుస్తాయి. రాజు యయాతి కథతో వాటి ప్రాముఖ్యతను తెలుసుకోండి.

Published on: Jul 20, 2026, 14:00:13 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఒక్కరూ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ చాలామంది ఇళ్లల్లో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఏదో ఒక కారణంతో భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, ప్రతి చిన్న విషయానికి ఇద్దరి మధ్య ఆర్గుమెంట్లు జరగడం చాలా సాధారణం. మీ ఇంట్లో కూడా ఇలానే ఉందా? వైవాహిక జీవితం బాగుండాలా? భార్యాభర్తల బంధాన్ని బలంగా మార్చే ముఖ్యమైన మూడు సూత్రాలు ఇవే. వీటిని పాటించడం వల్ల కుటుంబంలో ప్రశాంతత ఉండడమే కాదు, వైవాహిక జీవితంలో ఆనందం కూడా పెరుగుతుంది.

భార్యాభర్తల బంధాన్ని బలంగా మార్చే 3 సూత్రాలు ఇవే.. శ్రీమద్భాగవతం చెప్పిన గొప్ప సందేశం! (pinterest)
భార్యాభర్తల బంధాన్ని బలంగా మార్చే 3 సూత్రాలు ఇవే.. శ్రీమద్భాగవతం చెప్పిన గొప్ప సందేశం! (pinterest)

శ్రీమద్భాగవతం ప్రకారం విజయవంతమైన వైవాహిక జీవితానికి ముఖ్యమైన మూడు స్తంభాలు ఉన్నాయి. అవి పరస్పర గౌరవం, నమ్మకం, విశ్వాసం. ఈ మూడు గుణాలు ప్రతి ఒక్కరిలో ఉండేలా చూసుకోవాలి. ఈ మూడు గుణాలు లేకపోతే దాంపత్య జీవితంలో స్థిరత్వం కొనసాగడం చాలా కష్టం.

పరస్పర గౌరవం, నమ్మకం, విశ్వాసం ఎందుకు అంత ముఖ్యం?

దాంపత్య జీవితంలో గౌరవం అంటే ఒకరి భావాలను, వ్యక్తిత్వాన్ని ఇంకొకరు గౌరవించడం. నమ్మకం అంటే ప్రతి పరిస్థితిలో భార్యా భర్తలు ఒకరికరు తోడుగా నిలబడేలా చేసే బలమైన పునాది. విశ్వాసం దాంపత్య బంధం పవిత్రతను, స్థిరత్వాన్ని కాపాడుతుంది. ఈ మూడు గుణాల్లో ఏది లేకపోయినా మనస్పర్థలు, అపార్థాలు పెరుగుతాయి. బంధంలో దూరం కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి.

రాజు యయాతి కథ చెప్పిన జీవన పాఠం

భాగవతంలో రాజు యయాతి కథ ఈ విలువల ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తుంది. శుక్రాచార్యుడు కుమార్తె దేవయానిని యయాతి వివాహం చేసుకుంటాడు. పెళ్లికి ముందు దేవయాని తప్ప ఇతర స్త్రీతో సంబంధం పెట్టుకోనని యయాతి చేత శుక్రాచార్యుడు మాట తీసుకుంటాడు. కానీ కాలక్రమంలో ఆ వాగ్దానాన్ని ఉల్లంఘించి శర్మిష్ఠ పట్ల ఆకర్షితుడవుతాడు.

ఈ విషయాన్ని తెలుసుకున్న దేవయాని తీవ్ర మనస్థాపానికి గురవుతుంది. ఆమె నమ్మకం పూర్తిగా దెబ్బతింటుంది. యయాతి ప్రవర్తనపై కోప్పడిన శుక్రాచార్యుడు అతడికి యవ్వనంలోనే వృద్ధాప్యం రావాలని శాపం ఇస్తాడు. తర్వాత యయాతి క్షమాపణ కోరినప్పటికీ, కోల్పోయిన నమ్మకం, గౌరవాన్ని తిరిగి సంపాదించడం చాలా కష్టమని ఈ కథ మనకు తెలియజేస్తుంది.

దాంపత్య బంధాన్ని ఇలా బలపరుచుకోవాలి

శ్రీమద్భాగవతం చెప్పిన ఈ సందేశం ఇప్పటికీ కూడా వర్తిస్తుంది. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. పరస్పర నమ్మకాన్ని నిలబెట్టుకుని, విశ్వాసంతో ఉండాలి. అప్పుడే వైవాహిక జీవితంలో ఆనందం, ప్రశాంతత, ప్రేమ ఉంటాయి.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More