Makara Sankranti 2026: మకర సంక్రాంతి వేళ ఈ రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు, వ్యాపారులకు రెట్టింపు లాభాలు!
మకర సంక్రాంతి పండుగ నాడు వివిధ ఆచారాలను, సంప్రదాయాలను పాటిస్తూ ఉంటాము. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారి జీవితంలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. కెరియర్ పరంగా పురోగతిని చూస్తారు. ఆదాయం కూడా పెరుగుతుంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు?సూర్య సంచారంతో ఏ రాశుల వారికి అదృష్టం కలగబోతోంది?
త్వరలోనే మకర సంక్రాంతి పండుగ రాబోతోంది. మకర సంక్రాంతి పండుగ నాడు వివిధ ఆచారాలను, సంప్రదాయాలను పాటిస్తూ ఉంటాము. పిల్లాపాపలతో కలిసి సంతోషంగా పండుగను జరుపుకుంటాము. ప్రతీ జనవరి నెలలో మకర సంక్రాంతి పండుగ వస్తుంది. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి సంచారం చేసినప్పుడు ఈ పండుగను జరుపుకుంటాము. అలాగే ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. అయితే సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది.

ఈ రాశుల వారు అనేక లాభాలను పొందుతారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారి జీవితంలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. కెరియర్ పరంగా పురోగతిని చూస్తారు. ఆదాయం కూడా పెరుగుతుంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? సూర్య సంచారంతో ఏ రాశుల వారికి అదృష్టం కలగబోతోంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో తెలుసుకుందాం.
మకర సంక్రాంతి వేళ ఈ రాశుల వారికి అద్భుతమైన లాభాలు, వ్యాపారులకు రెట్టింపు ప్రయోజనాలు కలగనున్నాయి
మేష రాశి
మేష రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. మకర సంక్రాంతి నుంచి ఈ రాశి వారి జీవితం మారిపోతుంది. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో ఈ రాశి వారు కెరియర్‌లో గొప్ప మార్పులను చూస్తారు. ఉద్యోగులకు కూడా ఇది అద్భుతమైన సమయం. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి గౌరవం, మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మకర సంక్రాంతి శుభ ఫలితాలను తీసుకు వస్తుంది. వ్యాపారస్తులు కూడా అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది.
సింహ రాశి
సింహ రాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశి వారికి మకర సంక్రాంతి వేళ అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులు అనేక విజయాలను పొందుతారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్నత అధికారులు సహకారం లభించడంతో గొప్ప ప్రయోజనాలను చూస్తారు. వైవాహిక జీవితం కూడా ఆనందంగా సాగుతుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి మకర రాశిలో సూర్యుడు ప్రవేశించడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. సంక్రాంతి నుంచి ఈ రాశి వారు పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.
తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. ఆధ్యాత్మిక రంగంలో కూడా ఆసక్తి చూపిస్తారు. పూర్వీకుల ఆస్తి ద్వారా ఎక్కువ లాభాలను పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది.
మకర రాశి
మకర రాశి వారికి సంక్రాంతి నుంచి బాగా కలిసి వస్తుంది. రాజకీయాల్లో పాల్గొవాలనుకునే వారికి కూడా ఇది అద్భుతమైన సమయం. సమాజంలో గౌరవ, మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలను వింటారు. ఈ సమయంలో చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడడానికి వీలవుతుంది. అనేక విజయాలను సాధిస్తారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


