రేపటి నుంచి ఈ రాశులకు గోల్డెన్ డేస్ షురూ.. కుజ అనుగ్రహంతో డబ్బు, శుభవార్తలు, అదృష్టంతో పాటు ఎన్నో

గ్రహాల సంచారంలో మార్పు రావాల్సినప్పుడు అది 12 రాశుల వారి జీవితంలో మార్పులను తీసుకు వస్తుంది. కొన్నిసార్లు గ్రహాల సంచారంలో మార్పు కారణంగా ప్రతికూల ప్రభావాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుజుడు కాలానుగుణంగా తన సంచారాన్ని మారుస్తూ ఉంటాడు. నవంబర్ 19 రాత్రి 7:40 కి కుజుడు తన నక్షత్రాన్ని మార్చబోతున్నాడు.

Published on: Nov 18, 2025 12:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎప్పటికప్పుడు గ్రహాలు వాటి సంచారాన్ని మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు రావాల్సినప్పుడు అది ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకు వస్తుంది. కొన్నిసార్లు గ్రహాల సంచారంలో మార్పు కారణంగా ప్రతికూల ప్రభావాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్రహాలు సంచారంలో మార్పు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కొంత మార్పు చోటు చేసుకుంటుంది. కుజుడు కూడా కాలానుగుణంగా తన సంచారాన్ని మారుస్తూ ఉంటాడు.

కుజ నక్షత్ర సంచారంలో మార్పు, ఈ రాశులకు అనేక లాభాలు
కుజ నక్షత్ర సంచారంలో మార్పు, ఈ రాశులకు అనేక లాభాలు

కుజుడు రాశి మార్పు చెందినపుడు అది ద్వాదశ రాశుల వారి జీవితంలో ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే కుజుడు కాలానుగుణంగా నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాడు. కుజుడి నక్షత్ర సంచారం త్వరలోనే జరగనుంది. జ్యోతిష్యశాస్త్రంలో కుజ సంచారం చాలా ముఖ్యమైనది. అలాగే కొత్త సంచారం ఎంతో ప్రభావితమైనది.

రేపే కుజ నక్షత్ర సంచారంలో మార్పు

ఇదిలా ఉంటే, నవంబర్ 19 బుధవారం రాత్రి 7:40 కి కుజుడు తన నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. అనురాధ నక్షత్రం నుంచి కుజుడు జ్యేష్ఠ నక్షత్రానికి ప్రవేశించబోతున్నాడు. దీంతో కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. జ్యేష్ఠ నక్షత్రంలో కుజుడు డిసెంబర్ 7 వరకు సంచారం చేస్తాడు.

దీంతో కొన్ని రాశులకు సానుకూల ఫలితాలు ఎదురవుతాయి, కొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశుల వారికి మాత్రం రేపటి నుంచి స్వర్ణ కాలం అని చెప్పొచ్చు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశులకు కుజ నక్షత్ర సంచారంతో శుభ ఫలితాలు ఎదురవుతాయో తెలుసుకుందాం.

కుజ నక్షత్ర సంచారంలో మార్పు, ఈ రాశులకు అనేక లాభాలు

1.మిథున రాశి

మిథున రాశి వారికి జ్యేష్ఠ నక్షత్రంలో కుజుడి సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు కావడంతో ఈ రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కెరీర్‌లో ఊహించని మార్పులు వస్తాయి. ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులను సక్రమంగా పూర్తి చేస్తారు. శ్రేయస్సు కలుగుతుంది. పనికి సంబంధించి విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.

2.తులా రాశి

తులా రాశి వారికి కుజుని నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. తులా రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఖర్చులు కూడా తగ్గుతాయి. బడ్జెట్‌ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఖర్చులు తగ్గించుకోవచ్చు. కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఇది శుభ సమయం. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.

3.మకర రాశి

మకర రాశి వారికి కూడా నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. కుజుడు జ్యేష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించడంతో ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో విదేశీ ఒప్పందాలను పొందే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కొనసాగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. కెరీర్ కూడా బాగుంటుంది. అదృష్టం పెరుగుతుంది. అనేక విధాలుగా లాభాలను పొందుతారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More