తొలి ఏకాదశి 2026: ఈ పరిహారాలు చేస్తే కెరీర్, ధన సమస్యలు దూరం.. శ్రీహరి అనుగ్రహం మీ సొంతం!

ఆషాఢ శుక్ల పక్ష ఏకాదశి అయిన దేవశాయని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజు నుంచి శ్రీమహా విష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని విశ్వాసం. కెరీర్‌లో పురోగతి, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సుఖ శాంతి కోసం ఈ పవిత్ర దినాన చేసే కొన్ని ప్రత్యేక పరిహారాలకు విశేష ప్రాధాన్యం ఉంది.

Published on: Jul 23, 2026, 09:30:55 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూ సాంప్రదాయంలో ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశికి అత్యంత విశిష్టత ఉంది. దీనినే దేవశాయని ఏకాదశి, తొలి ఏకాదశి లేదా ఆషాఢ ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏడాది జూలై 25వ తేదీన భక్తిశ్రద్ధలతో ఈ పవిత్ర వ్రతాన్ని ఆచరించనున్నారు. ఈ రోజు నుంచి జగత్పాలలకుడైన శ్రీమహా విష్ణువు శేషతల్పంపై యోగనిద్రలోకి వెళ్తారు.

తొలి ఏకాదశి 2026: ఈ పరిహారాలు చేస్తే కెరీర్, ధన సమస్యలు దూరం.. శ్రీహరి అనుగ్రహం మీ సొంతం!
తొలి ఏకాదశి 2026: ఈ పరిహారాలు చేస్తే కెరీర్, ధన సమస్యలు దూరం.. శ్రీహరి అనుగ్రహం మీ సొంతం!

దీనితో పాటు నాలుగు నెలల పాటు సాగే చాతుర్మాస వ్రతాలు ప్రారంభమవుతాయి. ఈ కాలంలో శుభకార్యాలు నిలిచిపోయినా, భగవద్భక్తికి, దానధర్మాలకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, కెరీర్ పరమైన అడ్డంకులను తొలగించుకోవడానికి ఈ ఏకాదశి రోజు కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అవేంటో పరిశీలిద్దాం.

కెరీర్ విజయానికి కేసరి అభిషేకం

ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఎదుగుదల లేక సతమతమవుతున్న వారు ఈ ఏకాదశి రోజు శ్రీహరి విష్ణువును కుంకుమపువ్వు కలిపిన పాలతో అభిషేకించాలి. "ఈ చిన్న పరిహారం ద్వారా వృత్తి జీవితంలో అడ్డంకులు తొలగిపోయి, మీ ప్రతిభను నిరూపించుకోవడానికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి" అని ఆధ్యాత్మిక పండితులు పేర్కొన్నారు.

ఆర్థిక సమస్యల నివారణకు తాంబూల పరిహారం

డబ్బు నిలవక ఇబ్బంది పడుతున్న వారు ఈ పవిత్ర దినాన ఒక తమలపాకుపై 'ఓం విష్ణవే నమః' అని రాసి విష్ణుమూర్తి పాదాల వద్ద సమర్పించాలి. మరుసటి రోజు ఆ ఆకును పసుపు రంగు గుడ్డలో చుట్టి మీ బీరువాలో లేదా ధనం దాచుకునే ప్రదేశంలో భద్రపరుచుకోవాలి. దీని వల్ల ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తొలగిపోతాయి.

కుటుంబ శాంతి, వైవాహిక జీవితం

ఇంట్లో నిత్య కలహాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వేధిస్తుంటే ఈ ఏకాదశి రోజు తులసి కోటను పూజించి ప్రదక్షిణలు చేయాలి. అలాగే శీఘ్ర వివాహం కోరుకునే యువతీ యువకులు అమ్మవారికి, తులసి మాతకు సౌభాగ్య వస్తువులను సమర్పించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

దానధర్మాలు, దీపారాధన మహత్యం

ఏకాదశి రోజు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో లేచి విష్ణు సహస్రనామ పారాయణం లేదా శ్రీమద్భాగవత కథా శ్రవణం చేయడం అత్యంత శుభప్రదం.

రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి ప్రదక్షిణ చేయడం ద్వారా విష్ణుమూర్తితో పాటు మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది.

నిరుపేదలకు అన్నదానం చేయడం ద్వారా సకల పాపాలు హరించుకుపోయి మోక్షప్రాప్తి కలుగుతుంది.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More