నేటి రాశి ఫలాలు: ఈ 6 రాశుల వారికి అద్భుతమైన రోజు.. మీ రాశి ఎలా ఉందంటే?
సెప్టెంబర్ 29, 2026 మంగళవారం నాటి రాశి ఫలాల ప్రకారం మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య తదితర 12 రాశుల వారి దినఫలాలు, హనుమత్ పూజ ప్రాముఖ్యత మరియు ఈరోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాల కదలికలను బట్టి ప్రతిరోజూ రాశిఫలాలను అంచనా వేస్తారు. నేడు సెప్టెంబర్ 29, 2026 మంగళవారం. హిందూ సంప్రదాయంలో మంగళవారం రోజున సంకట మోచనుడైన హనుమంతుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం ఆనవాయితీగా వస్తోంది.

ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటే జీవితంలోని భయాలు, రోగాలు, సమస్త కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మరి ఈ మంగళవారం గ్రహాల స్థితిగతులరీత్యా ఏ రాశి వారికి ఎలా గడవనుంది? ఏ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి? అనే విషయాలను ఇప్పుడు వివరంగా చూద్దాం.
మేష రాశి: ఆత్మవిశ్వాసంతో మునుముందుకు..
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ వ్యక్తిగత వికాసం, సెల్ఫ్ లవ్‌పై కాస్త దృష్టి పెట్టడం మంచిది. మీరు పడే కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి, ఎవరికీ అప్పులు ఇవ్వడం గానీ, తీసుకోవడం గానీ చేయకండి. వివాహిత జీవితం ఆనందంగా సాగిపోతుంది.
వృషభ రాశి: కోపాన్ని అదుపులో ఉంచుకోండి
వృషభ రాశి జాతకులు ఈ రోజు తమ కోపాన్ని, మాటతీరును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా, సుఖసంతోషాలతో ఉంటుంది. అయితే మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహಿಸాల్సిన అవసరం ఉంది. రోజంతా బిజీగా గడిచినప్పటికీ, సాయంత్రం వేళ సౌకర్యాలు లేదా విలాస వస్తువుల కోసం ధనం ఖర్చు చేసే అవకాశం ఉంది.
మిథున రాశి: శ్రమకు తగిన ఫలితం
మిథున రాశి ఉద్యోగస్తులకు ఈ రోజు ప్రారంభంలో పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండే సూచనలున్నవి. అయితే రోజు గడిచే కొద్దీ మీ పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేసి మనసారా సంతృప్తి చెందుతారు. అనుకున్న లాభాలు దక్కడానికి మరికొంత అదనపు శ్రమ అవసరం అవుతుంది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి.
కర్కాటక రాశి: ఆర్థిక బలపడే సమయం
కర్కాటక రాశి వారికి ఈ రోజు సంపద పరంగా ఎంతో అనుకూలంగా ఉంది. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారం చేసే వారికి ఆశించిన లాభాలు అందుతాయి. మీరు పడే ప్రతి శ్రమకు సరైన ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా ఉద్యోగం చేసే వారికి మధ్యాహ్నం తర్వాత మంచి కెరీర్ అవకాశాలు తలుపు తడతాయి.
సింహ రాశి: బడ్జెట్ అదుపులో ఉంచుకోండి
సింహ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరంగా కొద్దిగా ఇబ్బందికరంగా మారవచ్చు. మీ నెలవారీ బడ్జెట్ తలకిందులయ్యే ఛాన్స్ ఉంది. మీ సంతానం ప్రవర్తన లేదా వారి విషయాల వల్ల కొద్దిగా మానసిక ఆందోళన చెందుతారు. అయితే రోజు మధ్యలో ఏదైనా ముఖ్యమైన పనిలో ఊహించని విజయం సాధించి ఉత్సాహం పొందుతారు. శుభవార్తలు వినే అవకాశం ఉంది.
కన్యా రాశి: అదృష్టం తలుపు తట్టే రోజు
కన్యా రాశి వారికి ఈ రోజు అదృష్టం పూర్తిగా వెన్నంటి ఉంటుంది. మీరు తలపెట్టిన ప్రతి పనిలోనూ ఆశించిన సఫలత సాధిస్తారు. చాలా కాలంగా ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. మధ్యాహ్నం సమయంలో ఒక విశిష్ట వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంది. వివాహిత జాతకులకు రొమాంటిక్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది.
తులా రాశి: ఖర్చులను నియంత్రించండి
తులా రాశి వారికి ఈ రోజు అనవసర ఖర్చులు ఎదురుకావచ్చు. రోజు ప్రారంభంలోనే షాపింగ్ లేదా ఇతర అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. మనసులో నిరాశావాద భావాలు, వ్యతిరేక ఆలోచనలు రాకుండా చూసుకోండి. సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లడం వల్ల సమస్యల నుంచి త్వరగా బయటపడవచ్చు.
వృశ్చిక రాశి: రహస్య శత్రువుల పట్ల అప్రమత్తత
వృశ్చిక రాశి జాతకులు ఏ పనిలోనూ అజాగ్రత్తగా ఉండకూడదు. ఉద్యోగం చేసేవారు మీ కార్యాలయంలోని రహస్య శత్రువుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఈ రోజు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
ధనుస్సు రాశి: ప్రణాళికాబద్ధంగా ఖర్చులు చేయండి
ధనుస్సు రాశి వారికి ఈ రోజు కొన్ని పెద్ద ఖర్చులు రావచ్చని సూచిస్తోంది. ఉదయం పూట కొన్ని చిన్నపాటి అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత కాస్త తగ్గవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సంయమనం పాటించండి.
మకర రాశి: ఒడిదుడుకులతో కూడిన రోజు
మకర రాశి వారికి ఈ రోజు హెచ్చుతగ్గులతో కూడుకుని ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ లభించే అవకాశాలున్నాయి. అయితే రోజు మధ్యలో మీ అంతర్గత శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. ప్రశాంతంగా ఉంటూ అడుగువేయడం మంచిది.
కుంభ రాశి: ఆర్థిక వ్యవహారాల్లో మెలకువ అవసరం
కుంభ రాశి జాతకులకు ఈ రోజు భారీ ఖర్చులు ఎదురుకావడంతో ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుంది. సమయాన్ని, ధనాన్ని చాలా విచక్షణతో ఖర్చు చేయాలి. లేదంటే మానసిక ఒత్తిడి, శారీరక అలసట బారిన పడే అవకాశం ఉంది. అనవసర విషయాలకు దూరంగా ఉండండి.
మీన రాశి: ప్రయాణాలు, కొత్త అనుభవాలు
మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. వృత్తిపరమైన అవసరాల నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. రోజు ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదురైనా, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఓపికతో వ్యవహరిస్తే అనుకూల ఫలితాలు మీ సొంతమవుతాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


