హిందూ సంప్రదాయంలో బుధవారం రోజున విఘ్నేశ్వరుడైన శ్రీ గణేశుడిని పూజించడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వినాయకుడి అనుగ్రహం ఉంటే జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోయి సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. మారుతున్న గ్రహాల రాశులు, నక్షత్రాల గమనం ప్రకారం సెప్టెంబర్ 2, బుధవారం రోజు పలు రాశుల వారికి ఎంతో కీలకమైనదిగా మారింది. కొన్ని రాశుల వారికి ఈ రోజు అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనుండగా, మరికొన్ని రాశులు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. నేటి దినఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి:

ఈ రోజు మేష రాశి వారి మనసు ఎంతో ప్రశాంతంగా, ఉత్సాహంగా మారుతుంది. కార్యాలయంలో మీకు అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగిస్తారు, వాటిని మీరు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అయినప్పటికీ అనవసరమైన ఆన్‌లైన్ షాపింగ్‌లకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
వృషభ రాశి:
వృషభ రాశి జాతకులకు నేడు వృత్తిరీత్యా ఎంతో నేర్చుకునే అవకాశం దక్కుతుంది. మీ పనితీరును గమనించిన పైఅధికారులు ప్రత్యేకంగా అభినందిస్తారు. కుటుంబంలో చిన్నపాటి విషయాలపై చర్చలు జరిగినా, కూర్చొని మాట్లాడుకుంటే సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. ఎవరికీ పెద్ద మొత్తంలో డబ్బులు అప్పుగా ఇవ్వకపోవడం ఉత్తమం. ఆహారపు అలవాట్ల విషయంలో కాస్త జాగ్రత్త వహించండి.
మిథున రాశి:
మిథున రాశి వారికి ఈ రోజు ఏదో ఒక రూపంలో మంచి వార్త వినబడుతుంది. ఉద్యోగం చేసే వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉండి, తోటి ఉద్యోగుల మధ్య మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. బంధాల్లో గతంలో ఉన్న మనస్పర్థలు తొలిగిపోతాయి. సాయంత్రం సమయంలో స్నేహితులతో సరదాగా గడిపే అవకాశం ఉంది. అయితే అనుకోని చిన్న ఖర్చులు ఎదురుకావచ్చు.
కర్కాటక రాశి:
ఈ రోజు కర్కాటక రాశి వారు తమ పనులను పూర్తి చేయడానికి కాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇంట్లోని పెద్దల సలహాలు మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయి. ప్రేమ జీవితంలో భాగస్వామితో మనసు విప్పి మాట్లాడటం ముఖ్యం, లేదంటే చిన్న విషయాలు పెద్దవిగా మారే ప్రమాదం ఉంది. ఏ రంగంలోనైనా పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. రాత్రివేళ తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి.
సింహ రాశి:
{{/usCountry}}ఈ రోజు కర్కాటక రాశి వారు తమ పనులను పూర్తి చేయడానికి కాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇంట్లోని పెద్దల సలహాలు మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయి. ప్రేమ జీవితంలో భాగస్వామితో మనసు విప్పి మాట్లాడటం ముఖ్యం, లేదంటే చిన్న విషయాలు పెద్దవిగా మారే ప్రమాదం ఉంది. ఏ రంగంలోనైనా పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. రాత్రివేళ తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి.
సింహ రాశి:
{{/usCountry}}సింహ రాశి వారికి ఈ రోజు అన్ని విధాలా అదృష్టం కలిసి వస్తుంది. ఆఫీస్‌లో మీరు చెప్పే ఐడియాలు, సలహాలను అందరూ మెచ్చుకుంటారు. సొంతంగా వ్యాపారం నిర్వహించే వారికి ఊహించని రీతిలో లాభాలు వచ్చే సూచనలున్నాయి. మీ భాగస్వామితో రొమాంటిక్ సమయాన్ని గడుపుతారు. అయితే ఎలాంటివేశంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చాలా ముఖ్యం.
కన్య రాశి:
కన్య రాశి జాతకులు ఏ పని తలపెట్టినా ముందుగా చక్కటి ప్రణాళిక వేసుకోవడం అవసరం. తొందరపాటులో చేసే పనులు చెడిపోయే అవకాశం ఉంది. ఇప్పటివరకు అవివాహితులుగా ఉన్నవారికి ప్రత్యేక వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే ఛాన్స్ ఉంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా సాగుతుంది. వేయించిన లేదా కారంగా ఉండే బయటి తిండికి దూరంగా ఉండటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
తులా రాశి:
ఈ రోజు తులా రాశి వారి పూర్తి దృష్టి తమ కెరీర్‌ను మరింత మెరుగుపరుచుకోవడంపైనే ఉంటుంది. వృత్తి జీవితానికి సంబంధించి ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. భాగస్వామితో గడిచిన పాత విషయాలను మళ్లీ ప్రస్తావించి వాదనలకు దిగకండి. రోజువారీ ఖర్చులపై నిఘా పెట్టడం చాలా అవసరం.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఆశించిన వేగంతో పనులు పూర్తి కాకపోవచ్చు, కాబట్టి ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రశాంతంగా, ఓపికతో వ్యవహరిస్తే పరిస్థితులు మీ దారికి వస్తాయి. ఈ రోజు ఎలాంటి ఆర్థిక సంబంధిత పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. భాగస్వామితో మీ భావాలను ప్రేమగా వ్యక్తపరచండి. రోజంతా పడిన శ్రమ వల్ల కలిగిన అలసటను తీర్చుకోవడానికి తగిన విశ్రాంతి తీసుకోండి.
ధనుస్సు రాశి:
కొత్త పనులకు శ్రీకారం చుట్టేందుకు ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు దక్కి మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. వ్యాపారస్తులకు ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కొన్ని కీలక విషయాలపై చర్చిస్తారు. లవ్ లైఫ్ ఎంతో ఆహ్లాదకరంగా సాగుతుంది. వృథా ఖర్చులకు అడ్డుకట్ట వేయండి.
మకర రాశి:
మకర రాశి వారు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. కెరీర్‌లో ముందుకు వెళ్లేందుకు సరికొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కుటుంబ సభ్యులతో సరదాగా సమయం గడపడం ద్వారా మీ మనసులోని బరువు తగ్గి ఉల్లాసంగా ఉంటారు. భాగస్వామి మనసును అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. కడుపునకు సంబంధించిన చిన్నపాటి సమస్యలు రాకుండా మంచి ఆహారం తీసుకోండి.
కుంభ రాశి:
ఎప్పటినుంచో ప్రారంభించాలనుకుంటున్న పనులకు ఈ రోజే సరైన శ్రీకారం చుట్టవచ్చు. కార్యాలయంలో మీలోని క్రియేటివిటీకి పైఅధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోయి పరిస్థితి మెరుగుపడుతుంది. స్నేহులతో అకస్మాత్తుగా కలిసి సరదాగా గడిపే అవకాశం ఉంది. ప్రేమ బంధాలలో ఈగోను అస్సలు దరిచేరనీయకండి.
మీన రాశి:
మీన రాశి వారికి ఈ రోజు పనిభారం కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పటికీ, సమయానికి అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. పాత క్లయంట్లు లేదా సన్నిహితుల ద్వారా ఊహించని ఆర్థిక లాభం కలుగుతుంది. కుటుంబంలో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు మౌనంగా ఉండటం చాలా మంచిది. భాగస్వామికి తగినంత సమయం కేటాయించండి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది.