...
...
Next Story

తాబేలు ఉంగరం ఇలా ధరిస్తే ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతత వస్తాయట!

ఫెంగ్ షుయ్, జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం తాబేలు ఆకారపు ఉంగరం సానుకూల శక్తి, ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతతకు ప్రతీకగా భావిస్తారు. ముఖ్యంగా వెండి తాబేలు ఉంగరం ఆర్థిక ఇబ్బందులు, వ్యాపార నష్టాలను తగ్గించడంతో పాటు కెరీర్‌లో కొత్త అవకాశాలు, స్థిరత్వం కలిగిస్తుందని నమ్ముతారు.

Published on: Sep 11, 2026, 08:00:37 IST
Advertisement

ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో లేదా చేతికి ధరించే తాబేలు ఉంగరం వల్ల కలిగే లాభాలేంటి? వెండి మరియు రాగి లోహాలతో తయారు చేసిన తాబేలు ఉంగరాలు జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని, మానసిక ప్రశాంతతను ఎలా తెస్తాయో ఇక్కడ తెలుసుకోండి.

తాబేలు ఉంగరం ఇలా ధరిస్తే ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతత వస్తాయట!
తాబేలు ఉంగరం ఇలా ధరిస్తే ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతత వస్తాయట!

ప్రస్తుత కాలంలో చాలా మంది జ్యోతిష్య నిపుణులు లేదా ఫెంగ్ షుయ్ నిపుణుల సలహా మేరకు తమ చేతి వేళ్లకు ప్రత్యేకమైన ఉంగరాలను ధరిస్తుంటారు. ముఖ్యంగా తాబేలు ఆకారంలో ఉండే ఉంగరాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఫెంగ్ షుయ్ శాస్త్రం ప్రకారం ఇంటా బయటా సానుకూల శక్తిని పెంచడంలో, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడంలో ఈ తాబేలు ఉంగరం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఈ ఉంగారాన్ని కొనుగోలు చేసే సమయంలో చాలా మందికి వెండి లేదా రాగి... ఏ లోహంతో చేసినది ధరించాలనే దానిపై సందిగ్ధత ఉంటుంది. ఈ రెండు లోహాల విశిష్టత ఏమిటో ఇక్కడ పరిశీలిద్దాం.

వెండి తాబేలు ఉంగరం ప్రత్యేకత ఏమిటి?

ఫెంగ్ షుయ్ విధానంలో తాబేలును జల తత్వానికి ప్రతీకగా భావిస్తారు. అలాగే వెండిని చంద్రుడికి సంబంధించిన లోహంగా పరిగణిస్తారు. జల తత్వం, చంద్రుడి కలయిక వల్ల వెండి తాబేలు ఉంగరం అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తుందని నిపుణులు నమ్ముతున్నారు.

వ్యాపారంలో తరచూ నష్టాలు ఎదుర్కొంటున్నవారు, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్నవారు వెండి తాబేలు ఉంగరాన్ని ధరించడం మంచిది. ఇది కెరీర్ పరంగా ఎదుగుదలను ఇవ్వడంతో పాటు జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని చేకూరుస్తుంది. అంతేకాకుండా విపరీతమైన కోపం, మానసిక అశాంతి తో బాధపడేవారికి మనసును ప్రశాంతంగా ఉంచడంలో ఈ ఉంగరం అద్భుతంగా పని చేస్తుంది. కొత్త అవకాశాలు తలుపు తట్టేలా చేయడంలో వెండి ఉంగరం ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

రాగి తాబేలు ఉంగరం ఎందుకు ధరించాలి?

మీ వ్యక్తిగత అవసరాలు, ఆరోగ్య లేదా ఆర్థిక పరమైన సమస్యలను బట్టి వెండి లేదా రాగి లోహంలో తాబేలు ఉంగరాన్ని చేయించుకోవచ్చు. ఈ ఉంగారాన్ని ధరించేందుకు శుక్రవారం అత్యంత అనువైన రోజుగా భావిస్తారు. నియమాల ప్రకారం ఈ ఉంగరాన్ని కుడి చేతి చూపుడు వేలుకు ధరించడం శుభప్రదం. మనసారా నమ్మి, సరైన పద్ధతిలో ఈ ఉంగారాన్ని ధరిస్తే జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని నమ్ముతారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks