కొత్త సంవత్సరం ఉగాది (Ugadi 2026) నుంచి ప్రారంభమవుతుంది. ఈసారి వచ్చే కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరం. తెలుగు వారి నూతన సంవత్సరం ప్రారంభం ఉగాది నుంచి జరుగుతుంది. ఉగాది నుంచి ప్రకృతిలో ఎన్నో మార్పులు వస్తాయి. ప్రకృతిలో కొత్త చిగుర్లు తొడుగుతాయి. అలాగే కొత్త ఆశలు కూడా చిగురుస్తాయి. ఉగాది ఆనందం, శ్రేయస్సు, కొత్త ప్రారంభాలకు సంకేతం.

ఇంత విశేషమైన రోజున ఖచ్చితంగా కొన్ని మంత్రాలు చదివేటట్టు చూసుకోండి. ఈ మంత్రాలను చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కొన్ని శుభకార్యాలను మొదలుపెట్టడం వలన ఏడాది మొత్తం సానుకూల మార్పులను చూస్తారు. ఉగాది నాడు పఠించాల్సిన మంత్రాలు, ఆచరించాల్సిన పద్ధతుల గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం.
ఉగాది నాడు పఠించాల్సిన మంత్రాలు
ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయడం మంచిదని మనకు తెలిసిందే. పంచాంగ శ్రవణం చేసేటప్పుడు సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను అందరూ వింటారు. అలాగే దైవానికి కృతజ్ఞతలు చెబుతారు. దాంతో పాటు ఈ మంత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఏడాది అంతా సానుకూల మార్పులను చూడొచ్చు.
సూర్య మంత్రం:
“ఓం సూర్యాయ నమః” అనే మంత్రాన్ని ఉగాది నాడు తప్పక పఠించండి. ఈ మంత్రాన్ని పఠించడం వలన ఆరోగ్యం, తేజస్సు, విజయాలు లభిస్తాయి. సూర్యుడు శక్తికి ప్రతీక అని చెప్పచ్చు.
లక్ష్మీ మంత్రం:
“ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః”
లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే డబ్బుకు లోటు ఉండదు. లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సును తీసుకొస్తుంది. ఈ మంత్రాన్ని రోజూ చదవడం వలన ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.
విష్ణువు మంత్రం:
“ఓం నమో భగవతే వాసుదేవాయ”.
ఈ మంత్రాన్ని జపిస్తే అనేక మార్పులు కలుగుతాయి; సానుకూల మార్పులను చూడొచ్చు. విష్ణువు కాంతి, శ్రేయస్సును ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ మంత్రాన్ని కూడా జపించేటట్టు చూసుకోండి.
ఉగాది పచ్చడి మంత్రం:
శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ
సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం
{{/usCountry}}ఈ మంత్రాన్ని జపిస్తే అనేక మార్పులు కలుగుతాయి; సానుకూల మార్పులను చూడొచ్చు. విష్ణువు కాంతి, శ్రేయస్సును ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ మంత్రాన్ని కూడా జపించేటట్టు చూసుకోండి.
ఉగాది పచ్చడి మంత్రం:
శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ
సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం
{{/usCountry}}ఉగాది పచ్చడిని తీసుకునేటప్పుడు ఒక మంత్రాన్ని చదువుకోవాలి. ఈ మంత్రాన్ని చదివి ఉగాది పచ్చడిని తీసుకోవడం వలన మంచి ఫలితం కూడా చూడొచ్చు.
ఉగాది నాడు ఆచరించాల్సినవి
ఉగాది నాడు పైన చెప్పిన మంత్రాలు చదువుకోవడంతో పాటు ఈ పద్ధతులను కూడా పాటించేటట్టు చూసుకోండి. ఇవి కూడా మంచి ఫలితాలను తీసుకొస్తాయి.
ఉగాది పచ్చడి: ఉగాది నాడు ఉగాది పచ్చడి ప్రత్యేకంగా ఉంటుంది. ఇది జీవితంలోని షడ్రుచులను సూచిస్తూ ఒక సందేశాన్ని అందిస్తుంది.
కొత్త బట్టలు ధరించడం: ఈరోజు కొత్త బట్టలు ధరించడం శుభసూచికంగా చెబుతారు.
దానధర్మాలు: ఉగాది నాడు తోచినంత దానధర్మాలు చేయడం వలన పుణ్యం కలుగుతుంది. ఎంతో మంచి ఫలితాన్ని చూడొచ్చు. కష్టాలు కూడా తొలగిపోతాయి.
ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవడం: ఉదయాన్నే దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటే ఏడాది అంతా దైవానుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ తొలగిపోతాయి.
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం: ఉగాది నాడు ఇంటిని శుభ్రంగా ఉంచాలి. మామిడి తోరణాలు కట్టి ఇంటిని అందంగా అలంకరించుకుంటే సానుకూల శక్తి ప్రవహిస్తుంది; ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
ఉగాదిని ఎలా జరుపుకోవాలి?
- సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలను ధరించాలి. గుమ్మాలకు మామిడి ఆకులను కట్టి అందంగా అలంకరించాలి.
- ఇంటి ముందు ముగ్గులు వేసి గడపకు పసుపు, కుంకుమలు అద్దాలి. దీంతో మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది.
- ఇష్టదైవాన్ని మనసారా ఆరాధించి, ఆ తర్వాత పిండి వంటలతో నైవేద్యం పెట్టి కుటుంబ సమేతంగా స్వీకరించాలి.
- కచ్చితంగా షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తీసుకోవాలి.
- సాయంత్రం పంచాంగ శ్రవణం వినాలి.
- ఉగాది నాడు ఆనందంగా ఉంటే ఏడాది అంతా ఆనందంగా ఉండొచ్చు.