Vastu Shastra: పొరపాటున కూడా ఈ వస్తువులను వంటగదిలో ఉంచకండి, ఆర్థిక సమస్యలతో పాటు ఈ సమస్యలు రావచ్చు!

వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఆనందంగా ఉండడానికి కూడా వీలవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పాటించడం వలన అదృష్టం కూడా కలిసి వస్తుంది. అనేక విధాలుగా లాభాలను పొందవచ్చు. వంటగదిలో పొరపాటున కూడా వీటిని పెట్టకండి

Published on: Dec 19, 2025, 12:00:43 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఆనందంగా ఉండడానికి కూడా వీలవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పాటించడం వలన అదృష్టం కూడా కలిసి వస్తుంది. అనేక విధాలుగా లాభాలను పొందవచ్చు.

వంటగదిలో పొరపాటున కూడా వీటిని పెట్టకండి (gemini)
వంటగదిలో పొరపాటున కూడా వీటిని పెట్టకండి (gemini)

వాస్తు ప్రకారం ఇంటిని ఎప్పుడూ సానుకూల శక్తితో నిండి ఉండేటట్టు అలంకరించుకోవడం, నిర్మించడం ముఖ్యం. ఒకవేళ కనుక వాస్తు ప్రకారం ఇంటిని ఉంచినట్లయితే చాలా విధాలుగా లాభాలను పొందడానికి అవుతుంది. ఆనందం, శాంతి, ఆరోగ్యం, పురోగతి వంటి వాటిని చూడొచ్చు.

వాస్తు శాస్త్రం

అయితే ఇప్పుడు ఇంటికి వాస్తు సంబంధించి ఎలాంటి నియమాలను పాటించాలి, వేటిని ఏ దిశలో ఉంచితే మంచిది అనే విషయాలను తెలుసుకుందాం. వాస్తు ప్రకారం పొరపాటున కూడా వీటిని వంటగదిలో పెట్టడం మంచిది కాదు. వంటగదిలో సానుకూల శక్తి ప్రవహించేటట్టు చూసుకోవాలి. చాలామంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా వంటగదిలో ఈ వస్తువులను పెట్టొద్దు అని వాస్తు శాస్త్రం చెప్తోంది. మరి వంటగదిలో చేయకూడని తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వంటగదిలో పొరపాటున కూడా వీటిని పెట్టకండి

వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో అద్దాన్ని పెట్టడం మంచిది కాదు. వాస్తు ప్రకారం వంటగదిలో అద్దం ఉండడం వలన ప్రతికూల శక్తి ప్రవహిస్తుంది, సానుకూల శక్తి తొలగిపోతుంది. వాస్తు లోపాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తు దోషాలు పెరిగిన కొద్దీ అదే ఇంట్లో కుటుంబ సభ్యులపై నేరుగా ప్రభావం చూపించడం మొదలు పెడుతుంది. ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి వంటగదిలో అద్దం పెట్టడం మంచిది కాదు.

వంటగదిని ఏ దిశలో పెట్టాలి?

వంటగదిని నిర్మించేటప్పుడు కొన్నిటిని ప్రత్యేకంగా చూసుకోవాలి. ముఖ్యంగా వంటగది సరైన దిశలో ఉండేటట్టు చూసుకోవాలి. ఆగ్నేయం వైపు వంటగది ఉంటే చాలా మంచిదని చెబుతారు. ఈ దిశ అగ్ని మూలకానికి సంబంధించినది కాబట్టి ఇక్కడ వంట చేయడం చాలా శుభప్రదం అని చెప్పొచ్చు. వంటగదిని ఈ దిశలో నిర్మించడం కుదరకపోతే వాయువ్య దిశలో నిర్మించవచ్చు. ఈశాన్యం, నైరుతి, ఉత్తర దిక్కుల్లో వంటగది లేకుండా చూసుకోవాలి. వంట గది సరైన ప్రదేశంలో ఉంటే ప్రతికూల శక్తి తొలగి సానుకూల శక్తి వ్యాపిస్తుంది. లేదంటే ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది. అది కుటుంబ సభ్యులందరిపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది.

వంటగదిలో వీటిని కూడా ఉంచకండి.

1.విరిగిపోయిన పాత్రలు:

వంటగదిలో విరిగిపోయిన పాత్రలు పెట్టడం మంచిది కాదు. వీటి వలన దురదృష్టం కలుగుతుంది, ప్రతికూల శక్తితో బాధపడాల్సి వస్తుంది.

2.పాత, పాడైపోయిన ఆహార పదార్థాలు:

పాత ఆహార పదార్థాలు, పాడైపోయినవి వంటగదిలో ఉంటే ప్రతికూల శక్తి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.

3.మందులు:

వంటగదిలో మందులు పెట్టడం మంచిది కాదు. ఇది అశుభంగా భావిస్తారు. కాబట్టి ఈ తప్పు చేయకండి.

4.మురికి లేదా ఉపయోగం లేని వస్తువులు:

వంటగదిలో మురికి లేదా పనికిరాని సామాన్లు పెట్టకూడదు. వీటి వలన కూడా పాజిటివ్ ఎనర్జీ తొలగి నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

5.నీరు లీక్ అవ్వడం:

వంటగదిలో కుళాయిలు లీక్ అవ్వకుండా చూసుకోవాలి. నీరు లీక్ అవ్వడం వలన ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంటుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More