చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరిస్తే చాలా విధాలుగా లాభాలను పొందడానికి వీలవుతుంది. వాస్తు ప్రకారం అనుసరిస్తే సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అంతేకాకుండా ఆనందంగా ఉండడానికి కూడా వీలవుతుంది.

వాస్తు శాస్త్రం అనేది భారతదేశానికి చెందిన ఒక ప్రాచీన నిర్మాణ శాస్త్రం. సరిగ్గా వాస్తు నియమాలను పాటించినట్లయితే సంపద, సుఖ శాంతులు, ఆరోగ్యం కలుగుతాయి. అలాగే కొన్ని జంతువులు లేదా వాటి ప్రతీకలు కూడా మంచి శక్తిని, అదృష్టాన్ని తీసుకొస్తాయని వాస్తు శాస్త్రం చెప్తుంది. వాస్తు ప్రకారం ఈ జంతువులను ఇంట్లో పెట్టినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి. మరి ఇక ఆ వివరాలను ఇప్పుడే తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం ఈ జంతువులను ఇంట్లో పెట్టినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి
1.ఏనుగు:
ఏనుగు బలం, ఐశ్వర్యం, జ్ఞానం మొదలైన వాటికి ప్రతీక. తొండంతో ఉన్న ఏనుగుల జంట విగ్రహాలను ఇంట్లో పెట్టినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి. విజయాన్ని కూడా అందుకోవచ్చు. ఈ విగ్రహాన్ని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచినట్లయితే సానుకూల శక్తి వ్యాపిస్తుంది.
2.తాబేలు:
తాబేలు దీర్ఘాయుష్షు, స్థిరత్వం, రక్షణకు ప్రతీక. ఉత్తరం లేదా ఈశాన్య వైపున తాబేలు విగ్రహాన్ని పెట్టినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.
3.కప్ప:
మూడు కాళ్లతో నోట్లో నాణెం ఉన్న కప్ప సంపదను సూచిస్తుంది. వాస్తు ప్రకారం ఈ కప్ప విగ్రహాన్ని ఇంట్లో లేదా ఆఫీసులో ప్రధాన ద్వారం దగ్గర ఉంచినట్లయితే ధనలాభం కలుగుతుంది. ఆర్థిక స్థిరత్వం కూడా ఉంటుంది.
4.నెమలి:
నెమలి మన జాతీయ పక్షి. నెమలి అందం, కరుణ, సౌందర్యం మొదలైన వాటికి సంకేతం. నెమలి ఈకలను లేదా నెమలి చిత్రాలను ఇంట్లో పెడితే ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది. కుటుంబ జీవితంలో సఖ్యత కూడా ఉంటుంది.
5.చేపలు:
చేపలను ఇంట్లో పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి. రెండు చేపలతో ఉన్న అక్వేరియంను ఇంట్లో పెట్టినట్లయితే సంపద, ఆరోగ్యం, సామరస్యాన్ని పెంచుకోవచ్చు. సానుకూల శక్తి కూడా ఎక్కువవుతుంది.
6.ఆవు:
ఆవు మన భారతీయ సంస్కృతిలో పవిత్రమైన జంతువు. ఆవు విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఇంట్లో పెడితే సంపద, ఆరోగ్యం కలుగుతాయి. ఐక్యత, శాంతిని పెంపొందించుకోవచ్చు.
7.గుర్రం:
{{/usCountry}}ఆవు మన భారతీయ సంస్కృతిలో పవిత్రమైన జంతువు. ఆవు విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఇంట్లో పెడితే సంపద, ఆరోగ్యం కలుగుతాయి. ఐక్యత, శాంతిని పెంపొందించుకోవచ్చు.
7.గుర్రం:
{{/usCountry}}గుర్రం వేగం, శక్తి, విజయాన్ని సూచిస్తుంది. పరిగెడుతున్న గుర్రం ఫోటో లేదా విగ్రహాన్ని ఇంట్లో ఉంచినట్లయితే కెరీర్‌లో అద్భుతమైన మార్పులను చూడవచ్చు. వ్యాపారంలో ఎదుగుదల ఉంటుంది. ఉత్సాహం, విజయాలను పొందవచ్చు.