నక్షత్ర మార్పుతో ఈ 6 రాశుల జాతకం మారబోతోంది... అక్టోబర్ 23 వరకు ఊహించని ధనయోగం! పెరగనున్న బ్యాంక్ బ్యాలెన్స్
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రేమ, సంపదలకు కారకుడైన శుక్రుడు తన సొంత రాశి తులాలో, రాహువుకు చెందిన స్వాతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అక్టోబర్ 23 వరకు ఈ సంచారం వల్ల 6 రాశుల వారికి విపరీతమైన ధనలాభం కలగనుంది.
జ్యోతిష్యశాస్త్రంలో శుక్ర గ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శుక్రుడిని అందం, ఆకర్షణ, ప్రేమ, కళలు, ఐశ్వర్యానికి కారకుడిగా భావిస్తారు. జాతకంలో శుక్రుడి స్థితి అనుకూలంగా ఉంటే సమాజంలో మంచి గుర్తింపుతో పాటు ఆర్థికంగా తిరుగులేని పురోగతి లభిస్తుంది. అటువంటి శుక్ర గ్రహం నక్షత్ర మార్పు ప్రస్తుతం ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.

ప్రస్తుతం శుక్రుడు తన స్వక్షేత్రమైన తులా రాశిలో, రాహువుకు చెందిన స్వాతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. హిందూ పంచాంగం ప్రకారం…. స్వాతి నక్షత్రంలో శుక్రుడి సంచారం అక్టోబర్ 23 వరకు కొనసాగుతుంది. రాహువు నక్షత్రంలో శుక్రుడి ఈ పయనం కొన్ని రాశులకు అద్భుతమైన శుభ ఫలితాలను, మరికొన్ని రాశులకు ప్రతికూల మార్పులను తీసుకువస్తుంది.
ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం….. ఈ నక్షత్ర సంచారం ముఖ్యంగా 6 రాశుల వారికి అత్యంత ప్రయోజనకరంగా మారబోతోంది. రాబోయే 10 రోజుల పాటు ఈ రాశుల వారి బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇవే…
మిథున రాశి:
మిథున రాశి వారికి శుక్రుడి నక్షత్ర మార్పు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వీరికి ఆధ్యాత్మికం, దైవచింతన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి (ప్రమోషన్) లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనుకోకుండా వినే ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆదాయ మార్గాలు పెరిగి బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పుంజుకుంటుంది.
తులా రాశి:
స్వాతి నక్షత్రంలో శుక్రుడి సంచారం తులా రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. పూజా కార్యక్రమాలు, దైవ కార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. రాహు నక్షత్రంలో శుక్రుడి ఉనికి ఆర్థికంగా పెద్ద ఎత్తున కలిసివస్తుంది. వ్యాపారాలు చేసేవారికి ఊహించని లాభాలు అందుతాయి.
కన్యా రాశి:
కన్యా రాశి వారికి ఈ నక్షత్ర సంచారంతో ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా బలంగా మారుతుంది. పాత రుణాలు తీరిపోయే మార్గాలు సుగమమవుతాయి. అయితే… ఆర్థికంగా పురోగతి సాధిస్తున్నప్పటికీ, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మిమ్మల్ని మీరు శ్రద్ధగా చూసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
కుంభ రాశి:
కుంభ రాశి వారికి ఈ కాలం చాలా సానుకూలంగా సాగిపోతుంది. ముఖ్యంగా ప్రేమ జీవితంలో శృంగారం, అవగాహన పెరుగుతాయి. భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి. నూతన సంపాదన మార్గాలు తెరుచుకుని, రాబడి విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
మకర రాశి:
మకర రాశి జాతకులకు శుక్రుడి నక్షత్ర మార్పు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అదృష్టం పూర్తిగా మీ వైపే ఉంటుంది. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రియమైన వారిని, ప్రేమికులను కలిసే అవకాశం లభిస్తుంది. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి రాహు నక్షత్రంలో శుక్రుడి పయనం అత్యంత శుభఫలితాలను అందిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబంలోకి ఒక మంచి వార్త అందుతుంది. ఆర్థికంగా స్ధిరత్వం చేకూరుతుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

