గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకొస్తుంది. ఒక్కోసారి శుభ ఫలితాలు కనిపిస్తే, ఒక్కోసారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

శుక్రుడు కన్యా రాశిలో నేరుగా సంచారం చేస్తాడు. నవంబర్ 14 నుంచి శుక్రుడు ప్రత్యక్ష సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో అనేక రకాల లాభాలు కలగబోతున్నాయి. అదృష్ట రాశులు ఎవరు? ఇప్పుడు చూద్దాం.
శుక్రుడి ప్రత్యక్ష సంచారం 12 రాశుల వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏ రాశికి ఎలా ఉంటుంది?
మేష రాశి: మేష రాశి వారికి ఆర్థిక పరంగా బాగుంటుంది. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అయితే, వ్యాపారస్తులు కాస్త సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వృషభ రాశి: వృషభ రాశి వారికి శుక్రుడి ప్రత్యక్ష సంచారం మంచి ఫలితాలను అందిస్తుంది. రిలేషన్షిప్లో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. భాగస్వామితో సంతోషంగా ఉండొచ్చు. విద్యార్థులకు కూడా ఇదే శుభ సమయం.
మిథున రాశి: మిథున రాశి వారికి శుక్రుడు నేరుగా సంచరించడంతో మంచి ఫలితాలు ఉంటాయి. ప్రేమ జీవితంలో సంతోషం పెరుగుతుంది. వ్యాపారస్తులకు కూడా బాగా కలిసి వస్తుంది. విద్యార్థులకు కూడా ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి కాస్త ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. ఆర్థికపరంగా కలిసి వస్తుంది. చిన్న చిన్న ట్రిప్పులు వేస్తారు.
సింహ రాశి: సింహ రాశి వారికి శుక్రుడి ప్రత్యక్ష సంచారం ఆర్థికపరంగా లాభాలను అందిస్తుంది. ఉద్యోగస్తులు సహనంతో పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి.
కన్యా రాశి: కన్యా రాశి వారికి ఇది మంచి సమయం. ఈ సమయంలో అవకాశాలు పెరుగుతాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది.
{{/usCountry}}కన్యా రాశి: కన్యా రాశి వారికి ఇది మంచి సమయం. ఈ సమయంలో అవకాశాలు పెరుగుతాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది.
{{/usCountry}}తులా రాశి: తులా రాశి వారికి శుక్రుడి ప్రత్యక్ష సంచారం బాగా కలిసి వస్తుంది. పెండింగ్లో ఉన్న టాస్కులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చు. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆశతో వ్యవహరించాలి.
వృశ్చిక రాశి: వ్యాపారస్తులకు ఇది మంచి సమయం. స్నేహితుల సపోర్ట్ అందుకుంటారు. పెళ్లయిన వారికి కూడా సంతోషం ఉంటుంది. వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి.
ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారికి ఆర్థికపరంగా బాగుంటుంది. ఉద్యోగస్తులకు కూడా కాస్త రిలీఫ్ ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంతోషంగా ఉంటారు.
మకర రాశి: మకర రాశి వారికి ఇది అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు. పని ప్రదేశంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. సంతోషం రెట్టింపు అవుతుంది.
కుంభ రాశి: కుంభ రాశి వారికి శుక్రుడు నేరుగా సంచరించడంతో అద్భుతమైన లాభాలు ఉంటాయి. పురోగతిని చూస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. ఆస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి.
మీన రాశి: మీన రాశి వారికి శుక్రుడు నేరుగా సంచరించడంతో బాగుంటుంది. అపార్థాలు తొలగిపోతాయి. సంతోషం రెట్టింపు అవుతుంది. సహనం పెరుగుతుంది. వైవాహిక జీవితం కూడా ఆనందంగా సాగుతుంది.