...
...
Next Story

విజయదశమి వేళ దానధర్మాలు.. 12 రాశుల వారు ఏం దానం చేయాలంటే?

విజయదశమి పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి, నూతన ప్రారంభానికి ప్రతీకగా జరుపుకుంటారు. 2026 అక్టోబర్ 20, మంగళవారం నాడు వచ్చిన ఈ పర్వదినాన పూజలు, ప్రార్థనలతో పాటు దానధర్మాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉందని భావిస్తారు.

Published on: Oct 20, 2026, 09:30:42 IST
Advertisement

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటాము. అక్టోబర్ 20, మంగళవారం నాడు విజయదశమి వచ్చింది. హిందూ ధర్మంలో దసరా పండుగను విజయానికి, నూతన ప్రారంభానికి ప్రతీకగా భావిస్తారు.

విజయదశమి వేళ దానధర్మాలు.. 12 రాశుల వారు ఏం దానం చేయాలంటే? (AI)
విజయదశమి వేళ దానధర్మాలు.. 12 రాశుల వారు ఏం దానం చేయాలంటే? (AI)

అయితే, విజయదశమి నాడు మీ రాశి ప్రకారం ఏ వస్తువులను దానం చేస్తే మంచిది? ఏ వస్తువులను దానం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి: మేష రాశి వారు గోధుమలు, బెల్లం దానం చేయడం మంచిది. మతపరమైన నమ్మకాల ప్రకారం, ఈ వస్తువులను దానం చేయడం వలన అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి.

వృషభ రాశి: వృషభ రాశి వారు బియ్యం, పిండి వంటి వాటిని దానం చేయడం మంచిది. అవసరమైన వారికి ఆహార పదార్థాలను ఇస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి: మిథున రాశి వారు పెసలు, ఆకుకూరలు, కూరగాయలు వంటివి దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారు పెరుగు, పాలు వంటివి దానం చేస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. వీటిని దానం చేసేటప్పుడు పరిశుభ్రత, నాణ్యత పాటించండి.

సింహ రాశి: సింహ రాశి వారు బెల్లం, వేరుశెనగ వంటివి దానం చేయడం వలన మంచి ఫలితాలు కనిపిస్తాయి. అమ్మవారి అనుగ్రహంతో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి.

తులా రాశి: తులా రాశి వారు తెల్లటి వస్త్రాలు, ఆర్థిక స్థోమతకు తగ్గట్టుగా ధనాన్ని దానం చేయండి.

ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారు పసుపు రంగు వస్త్రాలు, ధాన్యాలు దానం చేయడం వలన అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా ఉండడానికి వీలవుతుంది. విజయదశమి వేళ శుభ ఫలితాలు కలుగుతాయి.

మకర రాశి: మకర రాశి వారు దుస్తులు, ఆహార ధాన్యాలను దానం చేయడం వలన మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే ధనం కూడా దానం చేయొచ్చు.

కుంభ రాశి: ఈ రాశి వారు నీలంగా ఉండే దుస్తులు, అవసరమైన వారికి చెప్పులు వంటివి దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

మీన రాశి: బియ్యం, పప్పులతో చేసిన కిచిడీని దానం చేయడం మంచిది. అవసరమైన వారికి భోజనాన్ని కూడా అందిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks