...
...
Next Story

జూలై 19–25 వార ఫలాలు.. ఉద్యోగం, ధనం, ఆరోగ్యం, ప్రేమ ఎలా ఉండబోతున్నాయి? ఈ రాశులకు గోల్డెన్ డేస్!

జూలై 19 నుంచి 25 వరకు 12 రాశుల వార ఫలాలు తెలుసుకోండి. ఈ వారం ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, ప్రేమ, కుటుంబ జీవితం ఎలా ఉండబోతుంది? గ్రహాల సంచారం వల్ల మేషం నుంచి మీనం వరకు ప్రతి రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోండి. ఎవరికీ అదృష్టం కలిసి వస్తుంది?

Published on: Jul 18, 2026, 16:00:17 IST
Advertisement

కొత్త వారం ప్రారంభం కాబోతోంది. ఈ ఏడు రోజులు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయి? ఉద్యోగస్తులకు ఎదురయ్యే సవాళ్లు, వ్యాపారాల్లో లాభనష్టాలు, ఆర్థిక పరిస్థితులు, అలాగే కుటుంబ సంబంధాల తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై 19 నుంచి 25 వరకు గ్రహాల సంచారం, వాటి ప్రభావం 12 రాశులపై ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం.

జూలై 19 నుంచి 25 వరకు వార ఫలాలు:

మేష రాశి:

జూలై 19–25 వార రాశి ఫలాలు.. ఉద్యోగం, ధనం, ఆరోగ్యం, ప్రేమ ఎలా ఉండబోతున్నాయి? ఈ రాశులకు గోల్డెన్ డేస్! (pinterest)
జూలై 19–25 వార రాశి ఫలాలు.. ఉద్యోగం, ధనం, ఆరోగ్యం, ప్రేమ ఎలా ఉండబోతున్నాయి? ఈ రాశులకు గోల్డెన్ డేస్! (pinterest)

ఆరోగ్యపరంగా మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ, హార్మోన్ల సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా మధుమేహం (షుగర్) ఉన్నవారు జాగ్రత్త వహించాలి. ప్రేమ విషయాల్లో ఆచితూచి అడుగు వేయడం ఉత్తమం. ఈ వారం కొత్త నిర్ణయాలు తీసుకోవడం కంటే, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మేలు. వారం ప్రారంభం, చివరి రోజుల్లో అప్రమత్తంగా ఉండాలి, మధ్య భాగం మీకు కలిసివస్తుంది.

వృషభ రాశి:

లగ్నంలో ఉన్న కుజుడి వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు బాగున్నప్పటికీ, కుటుంబంలో చిన్నపాటి గొడవలు రావచ్చు. ఛాతీ సంబంధిత ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్త పడండి. వారం చివర్లో శుభవార్తలు, ఆర్థిక ప్రగతి కనిపిస్తున్నాయి. పెట్టుబడులకు ఇది మంచి సమయం.

మిథున రాశి:

ఆరోగ్యం కుదుటపడుతుంది, కేవలం గొంతు, ముక్కు సంబంధిత సమస్యలు రావచ్చు. ప్రేమ, సంతాన విషయాల్లో కొంచెం అసంతృప్తి నెలకొనవచ్చు. వారం ప్రారంభంలో భూమి, వాహన కొనుగోళ్లకు అవకాశం ఉంది. మధ్యలో భావోద్వేగాలకు లోనవ్వకండి.

కర్కాటక రాశి:

ఆరోగ్య విషయంలో హెచ్చుతగ్గులు సహజం, కాబట్టి జాగ్రత్త అవసరం. ఆర్థికంగా ఖర్చులు పెరగవచ్చు, కాబట్టి పెట్టుబడులకు దూరంగా ఉండండి. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. వారం ప్రారంభంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మనశ్శాంతి కోసం ప్రయత్నించాలి.

సింహ రాశి:

ఆరోగ్యం బాగుంటుంది, అయితే తలనొప్పి, కంటి సమస్యలు తలెత్తవచ్చు. వ్యాపార రీత్యా ఇది సరైన సమయమే. వారం ప్రారంభంలో మీరు ఆకర్షణీయంగా కనిపిస్తారు, పనిలో దూసుకుపోతారు. మధ్యలో పెట్టుబడులకు దూరంగా ఉండండి.

తులా రాశి:

ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి, ముఖ్యంగా భుజం, గొంతు సమస్యలు రావచ్చు. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నందున ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. వారం మధ్యలో మీ శక్తియుక్తులు ప్రదర్శిస్తారు, ఆకర్షణీయంగా ఉంటారు.

వృశ్చిక రాశి:

ఈ వారం మీకు అంతా శుభప్రదం. ఆరోగ్యం, ప్రేమ, వ్యాపారం అన్నీ అనుకూలంగా ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మధ్యలో మాత్రం ఖర్చులు పెరగొచ్చు, కాబట్టి అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండండి. పెట్టుబడులకు ఇది సరైన సమయం.

ధను రాశి:

లగ్నాధిపతి అష్టమంలో ఉండటం వల్ల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. వారం ప్రారంభంలో వ్యాపారంలో విజయం, కోర్టు కేసుల్లో శుభపరిణామాలు ఉంటాయి. వారం చివర్లో అజ్ఞాత భయం వేధించవచ్చు.

మకర రాశి:

ప్రేమ, వైవాహిక జీవితంలో కొంచెం గందరగోళం ఉండవచ్చు. కొత్త బంధాలకు ఇది సరైన సమయం కాదు. అయితే, వారం మొత్తం చూసుకుంటే ఇది మీకు అత్యంత శుభకరమైన వారం. ఉద్యోగం, వ్యాపారాల్లో ఎదురులేని పురోగతి కనిపిస్తోంది.

కుంభ రాశి:

ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యంగా మహిళలు గైనకాలజీ సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవాలి. వారం ప్రారంభంలో కష్టంగా ఉన్నా, మధ్య నుంచి పరిస్థితి మెరుగుపడుతుంది. చివర్లో వ్యాపారాల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి.

మీన రాశి:

షుగర్, గుండె సంబంధిత సమస్యల విషయంలో జాగ్రత్త వహించండి. వ్యాపారపరంగా నెమ్మదిగా పుంజుకుంటున్నారు. వారం ప్రారంభంలో ఉద్యోగంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మధ్యలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా, చివరలో సాధారణ స్థితికి వస్తారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe