ఈ సమయంలో తుమ్మితే మీరు అదృష్టవంతులు.. ఏ రోజు తుమ్మితే ఏం జరుగుతుంది?
తుమ్మడం అనేది మనిషికి ఒక సాధారణ చర్యే. కానీ దీనిని శుభం, అశుభాలకు సంబంధించిన విషయంతో కూడా ముడిపెట్టి చూస్తారు. శకునాల ప్రకారం అది భవిష్యత్తు సంఘటనలకు సూచన అని నమ్ముతారు.
తుమ్మడం అనేది మనిషి చేసే సాధారణ చర్య. హిందూ మతంలోని శకున శాస్త్రం ప్రకారం తుమ్మడానికి దానికంటూ ఒక ప్రత్యేక అర్థం, ప్రాముఖ్యత కూడా ఉన్నాయి. మనం ఏదైనా శుభకార్యానికి వెళ్తున్నప్పుడు లేదా కొత్త ఉద్యోగంలో చేరుతున్నప్పుడు తుమ్మితే దానిని అశుభంగా లేదా పనికి ఆటంకంగా భావించడం చేస్తుంటాం. మన ఇంట్లో పెద్దవాళ్లు కూడా అదే చెబుతారు. బయటకు వెళ్లేప్పుడు తుమ్మితే.. ఇంట్లోకి వచ్చి కాస్త నీరు తాగి, కాసేపు కూర్చొని మళ్లీ ప్రయాణం మెుదలుపెడుతుంటాం. మనం తుమ్మే సమయాలన్నీ అశుభమైనవి కావు.

అదేవిధంగా కుడి వైపు నుండి తుమ్ము శబ్దం వినిపిస్తే, అది ఆర్థిక నష్టానికి లేదా పనిలో జాప్యానికి సంకేతంగా చెబుతారు. మన ఎడమ వైపున లేదా మన వెనుక ఎవరైనా తుమ్మితే అది చాలా శుభ శకునంగా భావిస్తారు. దీనివల్ల మనం మొదలుపెట్టిన పనిలో తప్పకుండా విజయం లభిస్తుందని నమ్ముతారు. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఒకసారి తుమ్మడం పనికి ఆటంకంగా భావిస్తుండగా, వరుసగా రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు తుమ్మడం పనిలో లాభానికి, విజయానికి సంకేతంగా చెబుతారు.
ఏ రోజు తుమ్మితే ఏంటి?
ఆదివారం తుమ్మితే, అది ఆరోగ్యం మెరుగుపడటాన్ని, భవిష్యత్తులో ఆర్థిక లాభాలను సూచిస్తుంది. సోమవారం మానసిక ప్రశాంతతకు, సుదూర ప్రాంతాల నుండి వచ్చే శుభవార్తకు సంకేతం. మంగళవారం నాడు మీకు తుమ్ము వస్తే, కొత్త వ్యక్తులను కలిసే అవకాశం లేదా కొన్ని చిన్న అడ్డంకులను ఎదుర్కొనే అవకాశం ఉందని సూచిస్తుంది.
బుధవారం వ్యాపారస్తులకు శుభప్రదం, ఊహించని ఆదాయాన్ని సూచిస్తుంది. గురువారం విద్యార్థులకు, ఉద్యోగులకు ఇది చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే కొత్త అవకాశాలు లభిస్తాయి. శుక్రవారం తుమ్మడం అనేది సంపద పెరుగుదలకు, సంతోషకరమైన భోజనానికి, ప్రశాంతమైన జీవితానికి సంకేతం. మీరు శనివారం తుమ్మితే చేపట్టిన పనిలో స్వల్ప జాప్యం జరగవచ్చు లేదా మీరు లక్ష్యం లేకుండా తిరగవచ్చు.
ఈ టైమ్‌లో తుమ్మితే
ఉదయం నిద్రలేవగానే.. తుమ్మితే.. అది శుభసూచకంగా చెబుతారు. దీంతో రోజంతా ఉల్లాసంగా ఉంటారు. అదేవిధంగా రాత్రి పడుకునే ముందు తుమ్మితే.. మరుసటి రోజు శుభవార్త వినవచ్చని అంటారు. మొత్తమ్మీద శాస్త్రం ప్రకారం తుమ్మడం అనేది ఒక శారీరక ప్రక్రియే. కానీ శకునాల ప్రకారం ఇది భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకు సూచిస్తుందని నమ్మకం.
గమనిక : ఇది కేవలం నమ్మకాల మీద ఆధారపడిన కథనం మాత్రమే. పైన ఇచ్చిన కంటెంట్‌కు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


