Lucky Colors: ప్రతి ఒక్క రాశి వారి తీరు, ప్రవర్తన మరో రాశితో పోల్చుకుంటే విభిన్నంగా ఉంటుంది. అలాగే కొన్ని రాశుల వారికి కొన్ని అదృష్టాన్ని తీసుకొస్తే, కొన్ని రాశుల వారికి అవే దురదృష్టాన్ని తీసుకు వస్తాయి. ఈరోజు అదృష్ట రంగుల గురించి చూద్దాం. మీరు రాశి ప్రకారం ఏ రంగు మీకు అదృష్టం తీసుకొస్తుందో ఇప్పుడే తెలుసుకోవచ్చు.

ప్రతి రాశికి కూడా ఏదో ఒక రంగుతో సంబంధం ఉంటుంది. ఆ రంగు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆ రంగు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ను పెంచుతుంది, సానుకూల శక్తి వ్యాపించేలా చేస్తుంది.
12 రాశుల వారి అదృష్ట రంగులు
మేష రాశి: మేష రాశి వారికి ఎరుపు, నారింజ రంగులు బాగా కలిసి వస్తాయి. ఈ రంగులు ఈ రాశి వారికి కాన్ఫిడెన్స్‌ను కూడా పెంచుతాయి.
వృషభ రాశి: వృషభ రాశి వారికి తెలుపు రంగు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ రంగు దుస్తులను ధరించడం వలన స్థిరత్వం ఉంటుంది.
మిథున రాశి: మిథున రాశి వారికి పసుపు, ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి. ఈ రంగులు ధరిస్తే కమ్యూనికేషన్ కూడా మెరుగుపడుతుంది.
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి సిల్వర్, క్రీమ్ రంగులు బాగా కలిసి వస్తాయి. ఈ రంగులను వీరు ధరించడం వలన శుభ ఫలితాలను చూస్తారు. సానుకూల మార్పులు కలుగుతాయి.
సింహ రాశి: సింహ రాశి వారికి బంగారు రంగు బాగా కలిసి వస్తుంది. దీంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు. పైగా అదృష్టం కూడా వెతుక్కుంటూ వస్తుంది.
కన్య రాశి: కన్య రాశి వారికి ఆకుపచ్చ రంగు బాగా కలిసి వస్తుంది. జీవితంలో స్థిరత్వాన్ని కూడా పొందుతారు.
{{/usCountry}}కన్య రాశి: కన్య రాశి వారికి ఆకుపచ్చ రంగు బాగా కలిసి వస్తుంది. జీవితంలో స్థిరత్వాన్ని కూడా పొందుతారు.
{{/usCountry}}తులా రాశి: తులా రాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది. ఇది ప్రశాంతతను పెంపొందిస్తుంది. రిలేషన్‌షిప్ కూడా బాగుంటుంది.
వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది. అదృష్టం కూడా పెరుగుతుంది.
ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారికి ముదురు పసుపు, లేత రంగులు బాగా కలిసి వస్తాయి. సానుకూలంగా ఆలోచిస్తారు. చక్కటి మార్పులను చూస్తారు.
మకర రాశి: మకర రాశి వారికి నలుపు, డార్క్ గ్రే రంగులు బాగా కలిసి వస్తాయి. సహనం, స్థిరత్వాన్ని పెంపొందించుకోవచ్చు.
కుంభ రాశి: కుంభ రాశి వారికి ముదురు నీలం రంగు బాగా కలిసి వస్తుంది. ఈ రంగులను ధరిస్తే బాగా ఆలోచించడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది.
మీన రాశి: మీన రాశి వారికి పసుపు, ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి. ప్రశాంతత పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. చక్కటి మార్పులను చూడొచ్చు.