Lucky Colors: మీ రాశిని బట్టి మీకు కలిసొచ్చే రంగు ఏదో తెలుసా? ఈ కలర్స్ వాడితే అదృష్టం మీ వెంటే!

Lucky Colors: రంగులకు మన జీవితంలో విడదీయలేని సంబంధం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి రాశికి ఒక అదృష్ట రంగు ఉంటుంది. సరైన రంగును ఎంచుకోవడం వల్ల సానుకూల శక్తి పెరగడమే కాకుండా, చేపట్టిన పనుల్లో విజయం సాధించవచ్చు. మీ రాశికి ఏ రంగు మేలు చేస్తుందో ఈ కథనంలో తెలుసుకోండి. 

Published on: Apr 24, 2026, 08:00:47 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Lucky Colors: ప్రతి ఒక్క రాశి వారి తీరు, ప్రవర్తన మరో రాశితో పోల్చుకుంటే విభిన్నంగా ఉంటుంది. అలాగే కొన్ని రాశుల వారికి కొన్ని అదృష్టాన్ని తీసుకొస్తే, కొన్ని రాశుల వారికి అవే దురదృష్టాన్ని తీసుకు వస్తాయి. ఈరోజు అదృష్ట రంగుల గురించి చూద్దాం. మీరు రాశి ప్రకారం ఏ రంగు మీకు అదృష్టం తీసుకొస్తుందో ఇప్పుడే తెలుసుకోవచ్చు.

Lucky Colors: మీ రాశిని బట్టి మీకు కలిసొచ్చే రంగు ఏదో తెలుసా? (pinterest)
Lucky Colors: మీ రాశిని బట్టి మీకు కలిసొచ్చే రంగు ఏదో తెలుసా? (pinterest)

ప్రతి రాశికి కూడా ఏదో ఒక రంగుతో సంబంధం ఉంటుంది. ఆ రంగు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆ రంగు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ను పెంచుతుంది, సానుకూల శక్తి వ్యాపించేలా చేస్తుంది.

12 రాశుల వారి అదృష్ట రంగులు

మేష రాశి: మేష రాశి వారికి ఎరుపు, నారింజ రంగులు బాగా కలిసి వస్తాయి. ఈ రంగులు ఈ రాశి వారికి కాన్ఫిడెన్స్‌ను కూడా పెంచుతాయి.

వృషభ రాశి: వృషభ రాశి వారికి తెలుపు రంగు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ రంగు దుస్తులను ధరించడం వలన స్థిరత్వం ఉంటుంది.

మిథున రాశి: మిథున రాశి వారికి పసుపు, ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి. ఈ రంగులు ధరిస్తే కమ్యూనికేషన్ కూడా మెరుగుపడుతుంది.

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి సిల్వర్, క్రీమ్ రంగులు బాగా కలిసి వస్తాయి. ఈ రంగులను వీరు ధరించడం వలన శుభ ఫలితాలను చూస్తారు. సానుకూల మార్పులు కలుగుతాయి.

సింహ రాశి: సింహ రాశి వారికి బంగారు రంగు బాగా కలిసి వస్తుంది. దీంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు. పైగా అదృష్టం కూడా వెతుక్కుంటూ వస్తుంది.

కన్య రాశి: కన్య రాశి వారికి ఆకుపచ్చ రంగు బాగా కలిసి వస్తుంది. జీవితంలో స్థిరత్వాన్ని కూడా పొందుతారు.

తులా రాశి: తులా రాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది. ఇది ప్రశాంతతను పెంపొందిస్తుంది. రిలేషన్‌షిప్ కూడా బాగుంటుంది.

వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది. అదృష్టం కూడా పెరుగుతుంది.

ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారికి ముదురు పసుపు, లేత రంగులు బాగా కలిసి వస్తాయి. సానుకూలంగా ఆలోచిస్తారు. చక్కటి మార్పులను చూస్తారు.

మకర రాశి: మకర రాశి వారికి నలుపు, డార్క్ గ్రే రంగులు బాగా కలిసి వస్తాయి. సహనం, స్థిరత్వాన్ని పెంపొందించుకోవచ్చు.

కుంభ రాశి: కుంభ రాశి వారికి ముదురు నీలం రంగు బాగా కలిసి వస్తుంది. ఈ రంగులను ధరిస్తే బాగా ఆలోచించడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది.

మీన రాశి: మీన రాశి వారికి పసుపు, ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి. ప్రశాంతత పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. చక్కటి మార్పులను చూడొచ్చు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More