మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే కీలక నేతలు మృతి చెందగా… భారీస్థాయిలో లొంగుబాట్లు జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో పలువురు రాష్ట్రస్థాయి నేతలు ఉన్నారు. 24 ఆయుధాలను అందజేశారు.
కీలక నేతలు…

లొంగిపోయిన వారిలో ప్లాటూన్ కమిటీ మెంబర్లు, డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది 509 మంది మావోయిస్టులు లొంగిపోయారని వివరించారు.
లొంగిపోయినవారిలో కొమురంభీం ఆసిఫాబాద్- మంచిర్యాల డివిజనల్ కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్(40), అర్బన్ ఏరియా పార్టీ సభ్యుడు కనికారపు ప్రభంజన్(33) ఉన్నారని డీజీపీ పేర్కొన్నారు. లొంగిపోయిన వారిలో తెలంగాణకు చెందిన వారు వీరిద్దరే ఉన్నారని చెప్పారు. రవి కామారెడ్డి జిల్లా ఆరెపల్లి వాసి అని… ప్రభంజన్‌ది మంచిర్యాల జిల్లా జన్నారమని వెల్లడించారు.
ఇరవై నాలుగు తుపాకులతో పాటు పెద్ద స్థాయిలో మందుగుండు సామగ్రిని కూడా అందజేశారని డీజీపీ పేర్కొన్నారు. లొంగిపోయిన ఆయుధాలలో ఒక ఇన్సాస్ లైట్ మెషిన్ గన్, మూడు ఏకే-47 రైఫిల్స్, ఐదు ఎస్ఎల్ఆర్లు, ఏడు ఇన్సాస్ రైఫిల్స్, ఒక బీఎల్ గన్, నాలుగు .303 రైఫిల్స్, ఒక సింగిల్ షాట్ రైఫిల్, రెండు ఎయిర్ గన్లు, 733 లైవ్ రౌండ్ల మందుగుండు సామగ్రి, ఎనిమిది బీజీఎల్ షెల్స్ ఉన్నాయని వివరించారు.
మావోయిస్టు కార్యకర్తలు హింసను విడిచిపెట్టి రాష్ట్ర అభివృద్ధి ప్రక్రియలో పాల్గొనాలని కోరుతూ అక్టోబర్ నెలలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కూడా పలువురు లొంగిపోయారని పోలీసులు తెలిపారు. అంతేకాకుండూ భద్రతా దళాల నుంచి నిరంతర ఒత్తిడి ఉండటంతో పాటు పార్టీలో నెలకొన్న అంతర్గత చీలికలు కూడా లొంగబాటుకు కారణమని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ పునరావాస విధానం కింద ర్యాంక్ ఆధారంగా రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తామని డీజీపీ తెలిపారు. శుక్రవారం లొంగిపోయిన 41 మంది కార్యకర్తలకు డాక్యుమెంటేషన్ పూర్తయిన తర్వాత మొత్తం రూ.1.46 కోట్లు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే రూ.25 వేల చొప్పున మధ్యంతర ఉపశమనం అందజేశామని పోలీసులు తెలిపారు.
{{/usCountry}}తెలంగాణ ప్రభుత్వ పునరావాస విధానం కింద ర్యాంక్ ఆధారంగా రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తామని డీజీపీ తెలిపారు. శుక్రవారం లొంగిపోయిన 41 మంది కార్యకర్తలకు డాక్యుమెంటేషన్ పూర్తయిన తర్వాత మొత్తం రూ.1.46 కోట్లు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే రూ.25 వేల చొప్పున మధ్యంతర ఉపశమనం అందజేశామని పోలీసులు తెలిపారు.
{{/usCountry}}ఒక్క 2025లోనే కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులతో సహా వివిధ ర్యాంకులకు చెందిన 509 మంది మావోయిస్టు కార్యకర్తలు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి వివరించారు. మిగిలి ఉన్న అండర్ గ్రౌండ్ కార్యకర్తలు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. పునరావాసం స్కీమ్ లో భాగంగా… అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు.