మెప్మా (MEPMA) సంస్థలో కీలక అధికారిగా ఉన్న అదనపు డైరెక్టర్ నల్లగుంట్ల యాదగిరిరావు ఏసీబీ వలకు చిక్కారు. సర్వీసులో ఉండగా తన అధికారిక హోదాను అడ్డుపెట్టుకుని అవినీతి, అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఆయనపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల (DA) కేసును నమోదు చేశారు.

కేసునమోదులో భాగంగా మంగళవారం ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లోని ఆయన నివాసం, ఆఫీసు, బ్యాంక్ లాకర్లతో పాటు బంధువులు, సన్నిహితులు, బెనామీల ఇళ్లతో కలిపి మొత్తం 10 ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా ఆస్తులను గుర్తించారు.
భారీగా ఆస్తులు…
ఏసీబీ సోదాల్లో భారీ ఎత్తున స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి. హైదరాబాద్ , సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో 12 ఓపెన్ ప్లాట్లు (విలువ రూ. 58.63 లక్షలు), హైదరాబాద్ ఉప్పల్‌లో రెండు నివాస ఫ్లాట్లు (విలువ రూ. 31.36 లక్షలు), ఉప్పల్‌లోనే పెెంట్‌హౌస్‌తో కూడిన G+3 భవనం (విలువ రూ. 2 కోట్లు), సూర్యాపేట జిల్లాలో రేకుల ఇల్లు (విలువ రూ. 4.75 లక్షలు), ఉప్పల్‌లో ఒక కమర్షియల్ షాపు (విలువ రూ. 1.06 లక్షలు) ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ లెక్కలతో కాకుండా…. బహిరంగ మార్కెట్‌లో వీటి అసలు విలువ చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.
స్థిరాస్తులతో పాటు భారీ మొత్తంలో చరాస్తులను కూడా సోదాల్లో ఏసీబీ స్వాధీనం చేసుకుంది.
- 1,792.2 గ్రాముల బంగారు ఆభరణాలు (విలువ రూ. 33.82 లక్షలు)
- 3 కిలోల వెండి వస్తువులు (విలువ రూ. 1.80 లక్షలు)
- టయోటా ఫార్చ్యూనర్ కార్ సహా రెండు కార్లు (విలువ రూ. 73 లక్షలు)
- మూడు ద్విచక్ర వాహనాలు (విలువ రూ. 2.80 లక్షలు)
- గృహోపకరణాలు (విలువ రూ. 29.08 లక్షలు),
- ఎలక్ట్రానిక్ వస్తువులు (విలువ రూ. 7.01 లక్షలు)
- వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న నిల్వలు రూ. 32.30 లక్షలు
ఇంకా ఉన్న అదనపు ఆస్తులకు సంబంధించి తనిఖీలు కొనసాగుతున్నాయని, కేసు విచారణలో ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. నిందితుడిని ప్రత్యేక ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ప్రకటించింది.
{{/usCountry}}ఇంకా ఉన్న అదనపు ఆస్తులకు సంబంధించి తనిఖీలు కొనసాగుతున్నాయని, కేసు విచారణలో ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. నిందితుడిని ప్రత్యేక ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ప్రకటించింది.
{{/usCountry}}ప్రభుత్వ అధికారులు లేదా సిబ్బంది ఎవరైనా అధికారిక పనుల కోసం లంచం డిమాండ్ చేస్తే వెనుకాడకుండా తమకు ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ సూచించింది. బాధితులు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా సంప్రదించవచ్చని పేర్కొంది. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేసింది.