బండి సాయి భగీరథ్ పోక్సో కేసు గురించి ఇప్పుడు తెలంగామలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. భగీరథ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు భగీరథ్‌కు సంబంధించి కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.

భగీరథ్ పోక్సో కేసుపై తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్‌గా ఉంది. ఈ కేసు వ్యవహారంలో కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
సీఎం సీరియస్
బండి భగీరథ్ మీద నమోదైన పోక్సో కేసుపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై నమోదైన కేసుపై తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. ఈ నెల 8వ తేదీనే ఫిర్యాదు అందినప్పటికీ నిందితుడిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
డీజీపీ సీవీ ఆనంద్ ఈ కేసులోని పూర్వాపరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసు బలగాలన్నీ భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాయని తెలిపారు. ఆ కారణంగానే కేసు దర్యాప్తులో కొంత జాప్యం జరిగిందని ముఖ్యమంత్రికి డీజీపీ వివరణ ఇచ్చారు.
కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చట్టం ముందు అందరూ సమానమేనని ఎటువంటి పక్షపాతం లేకుండా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసుపై ప్రభుత్వం కూడా సీరియస్‌గా ఉంది. ఈ మేరకు సిట్‌ను ఏర్పాటు చేసింది.
తెలంగాణ బీజేపీ ఏం అంటుంది?
బండి భగీరథ్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తెలిపారు. బండి భగీరథ్ కేసుతో బీజేపీకి సంబంధంలేదన్నారు. బండి సంజయ్ కుటుంబీకుల జోక్యం ఉంటే విచారణ చేయించాలని రామచందర్‌రావు సూచించారు. ఇది వారి వ్యక్తిగత విషయం అని, పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. మరోవైపు ప్రధాని మోదీ సభ విజయవంతంపై రామచందర్ రావు హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
{{/usCountry}}బండి భగీరథ్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తెలిపారు. బండి భగీరథ్ కేసుతో బీజేపీకి సంబంధంలేదన్నారు. బండి సంజయ్ కుటుంబీకుల జోక్యం ఉంటే విచారణ చేయించాలని రామచందర్‌రావు సూచించారు. ఇది వారి వ్యక్తిగత విషయం అని, పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. మరోవైపు ప్రధాని మోదీ సభ విజయవంతంపై రామచందర్ రావు హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
{{/usCountry}}