Bandi Sanjay Son Bhagirath POCSO Case : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసుపై ఇప్పటికే ప్రభుత్వం సిట్ కూడా ఏర్పాటు చేసింది. ఓవైపు దర్యాప్తు జరుగుతుండగా…. మరోవైపు భగీరథ్ ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

తనపై నమోదైన పోక్సో (POCSO) కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం కోర్టులకు వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో… ఈ పిటిషన్‌పై ఈనెల 14వ తేదీన వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది.
అసలేం జరిగింది…?
తన 17 ఏళ్ల కుమార్తెను బండి భగీరథ్ వేధిస్తున్నాడంటూ ఒక బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 8వ తేదీన హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్‌పై పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
భగీరథ్ ఎదురు ఫిర్యాదు
మరోవైపు…. ఈ వ్యవహారంలో బండి భగీరథ్ కూడా పోలీసులను ఆశ్రయించారు. సదరు బాలిక మరియు ఆమె తల్లి తనను లక్ష్యంగా చేసుకున్నారని, తప్పుడు ఆరోపణలు చేస్తూ డబ్బు కోసం తనను బెదిరిస్తున్నారని (Extortion) ఆయన ఆరోపించారు. భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు మే 7వ తేదీన కేసు నమోదు చేశారు.
తనపై నమోదైన కేసులో ఎలాంటి వాస్తవం లేదని…. అది కేవలం తనను, తన తండ్రి ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేసిన కుట్ర అని భగీరథ్ తన పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హైకోర్టు వెకేషన్ బెంచ్ ఇచ్చే తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. పోక్సో కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు ఎలా స్పందిస్తారు..? కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది…!
{{/usCountry}}తనపై నమోదైన కేసులో ఎలాంటి వాస్తవం లేదని…. అది కేవలం తనను, తన తండ్రి ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేసిన కుట్ర అని భగీరథ్ తన పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హైకోర్టు వెకేషన్ బెంచ్ ఇచ్చే తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. పోక్సో కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు ఎలా స్పందిస్తారు..? కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది…!
{{/usCountry}}ఇదిలా ఉంటే కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ను కాపాడేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో ఆరోపిస్తోంది. ఈ కేసులోని నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. కేసు నమోదైనప్పటికీ… ఇప్పటి వరకు నిందితుడిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ప్రశ్నిస్తోంది. బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని… అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని కూడా ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. బండి సంజయ్ కుమారుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ…. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆ పార్టీ నాయకులు, శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.