...
...
Next Story

తెలుగు ప్రయాణికులకు అలర్ట్.... తిరుపతి - కరీంనగర్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ టైమింగ్స్ మార్పు! కొత్త షెడ్యూల్ ఇలా

SCR Tirupati Karimnagar Express : తిరుపతి-కరీంనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (12761) టైన్ సమయాలను దక్షిణ మధ్య రైల్వే సవరించింది. అక్టోబర్ 10, 2026 నుంచి కొత్త టైమింగ్స్ అమల్లోకి వస్తాయి.

Published on: Aug 8, 2026, 10:48:42 IST
Advertisement

SCR Tirupati Karimnagar Express : తిరుపతి నుంచి కరీంనగర్ వైపు ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. రైళ్ల నిర్వహణ సజావుగా సాగించేందుకు, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా టైమింగ్స్ షెడ్యూల్(తిరుపతి - కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నెంబర్ - 12761) లో పలు మార్పులు చేసింది. ఈ సవరించిన రైలు వేళలు 2026 అక్టోబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

టైమింగ్స్ మార్పు - వివరాలు….

తిరుపతి-కరీంనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వేళల్లో మార్పులు
తిరుపతి-కరీంనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వేళల్లో మార్పులు

ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం తిరుపతి స్టేషన్ నుంచి రాత్రి 08:05 గంటలకు బయల్దేరే ఈ రైలు…. ఇకపై 15 నిమిషాల ముందే అంటే రాత్రి 07:50 గంటలకే ప్లాట్‌ఫాం వదిలి బయల్దేరుతుంది.

దీంతో పాటు దారిలోని ప్రధాన స్టేషన్లు, నిష్క్రమణ సమయాల్లో కూడా రైల్వే శాఖ తగిన మార్పులు చేసింది. రేణిగుంట స్టేషన్‌కు ప్రస్తుతం రాత్రి 08:28 గంటలకు వచ్చి 08:30కి బయల్దేరుతున్న ఈ ఎక్స్‌ప్రెస్…. కొత్త షెడ్యూల్ ప్రకారం రాత్రి 08:15 గంటలకే చేరుకుని 08:17 గంటలకు బయల్దేరుతుంది.

అలాగే శ్రీకాళహస్తి స్టేషన్‌కు ప్రస్తుతం ఉన్న రాత్రి 08:54 / 08:55 సమయాలకు బదులుగా…. ఇకపై రాత్రి 08:39 గంటలకే చేరుకుని 08:40 గంటలకు బయల్దేరుతుందని అధికారులు వెల్లడించారు.

తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి స్టేషన్లలో మాత్రమే ఈ సమయాల మార్పు వర్తిస్తుందని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి (సీపీఆర్‌ఓ) శ్రీధర్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ మూడు స్టేషన్ల తర్వాత మార్గమధ్యంలో వచ్చే మిగతా అన్ని రైల్వే స్టేషన్లలోనూ రైలు చేరే, బయల్దేరే సమయాల్లో ఎలాంటి మార్పులూ ఉండవని…. పాత షెడ్యూల్ ప్రకారమే రైలు నడుస్తుందని ఆయన వివరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe