...
...
Next Story

Chicken Prices : మాంస ప్రియులకు గుడ్ న్యూస్ - చికెన్ ధరలు తగ్గుముఖం..! గుడ్డు రేటు కూడా

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, గుడ్డు ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత నెలలో రూ.300 వరకు పలికిన కేజీ చికెన్ ధర.. ప్రస్తుతం గణనీయంగా తగ్గడంతో సామాన్యులకు ఉపశమనం దొరికినట్లు అయింది.

Published on: Aug 10, 2026, 13:31:30 IST
Advertisement

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు తగ్గుతున్నాయి. ఈ పరిణామం చికెన్ ప్రియులకు, సామాన్య ప్రజలకు ఉపశమనమనే చెప్పుకోవాలి. గత కొంతకాలంగా ఆకాశాన్నంటి సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయిన చికెన్, గుడ్ల ధరలు ఇప్పుడు ఒక్కసారిగా పడిపోతున్నాయి.

చికెన్ ధరలు తగ్గుముఖం…

చికెన్ ధరలు తగ్గుముఖం
చికెన్ ధరలు తగ్గుముఖం

గత నెలలో కేజీ చికెన్ ధర ఏకంగా రూ. 300 వరకు చేరుకుని సగటు వర్గాల బడ్జెట్‌ను తలకిందులు చేసింది. ఆదివారం వచ్చిందంటే చికెన్ షాపునకు వెళ్లాలంటేనే వెనకాడే పరిస్థితి కనిపించింది. అయితే గత కొద్ది రోజుల నుంచి ఈ ధరలు క్రమంగా తగ్గుతుండటంతో…. నాన్-వెజ్ ప్రియులుకు ఊరట లభించనట్లు అయింది.

హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో చికెన్ ధరలు ప్రస్తుతం సామాన్యుడికి ఎంతో సానుకూలంగా మారాయి. హైదరాబాద్ జోన్ లెక్కలను పరిశీలిస్తే.. ప్రస్తుతం కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 260 నుంచి 270 వద్ద కొనసాగుతుండగా, డ్రెస్సెడ్ చికెన్ కేజీ రూ.220గా నమోదు అవుతోంది. ఇక రిటైల్ లైవ్ బర్డ్ (కోడి) ధర కేజీకి రూ. 130 లోపే లభిస్తోంది. పౌల్ట్రీ రైతుల వద్ద కొనుగోలు చేసే ఎక్స్-ఫారం ధర రూ. 110 పలుకుతోంది.

గుడ్డు ధర కూడా…

చికెన్ ధరలతో పాటు ప్రతి ఇంటా నిత్యం వాడే కోడిగుడ్డు ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవల మార్కెట్ తీవ్రత వల్ల ఒక్కో కోడిగుడ్డు ధర ఏకంగా రూ. 10 వరకు చేరింది. దీంతో సామాన్యులు, దిగువ మధ్యతరగతి ప్రజలు కోడిగుడ్లు కొనడానికే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే పౌల్ట్రీ ఉత్పత్తి పెరగడం, వినియోగంలో వచ్చిన మార్పుల వల్ల ప్రస్తుతం కోడిగుడ్డు ధర గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక్కో కోడిగుడ్డు రూ. 6 నుంచి రూ. 7 మధ్యలో వినియోగదారులకు లభిస్తోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe