...
...
Next Story

ప్రతి ధాన్యం గింజా కొంటాం... తడిసిన వాటికి కూడా కనీస మద్దతు ఇస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

రైతులు పండించిన ప్రతి వరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. తడిసిన ధాన్యానికి కూడా మద్దతు ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

Published on: Jun 2, 2026, 06:58:10 IST
Advertisement

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అధైర్యపడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. “రైతాంగం వద్ద ఎన్ని క్వింటాళ్ల ధాన్యం ఉన్నా అన్నింటినీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అధైర్య పడొద్దు. తడిచిన ధాన్యానికి కూడా కనీస మద్దతు ధర ఇస్తుంది. ప్రతి గింజా కొంటాం. రెండు రోజులు వెనకాముందు.. ప్రతి గింజా కొంటాం” అని స్పష్టం చేశారు.

ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి
ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి

సోమవారం కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలోప్రసంగించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తప్పుబట్టారు.

కేవలం మద్దతు ధర ప్రకటించి వదిలేయడం కాకుండా రాష్ట్రంలో పండించిన ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వ బాధ్యతను గుర్తుచేశారు. ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలకు ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

రాష్ట్రానికి సంబంధించి అత్యంత కీలకమైన ధాన్యం కొనుగోలు, తుమ్మడిహట్టి వద్ద ప్రాణహిత - చేవెళ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరిని ముఖ్యమంత్రి ఎత్తిచూపారు. మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ రెండు కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. అందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై గురుతరమైన బాధ్యత ఉందని గుర్తుచేశారు. కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తే తదుపరి తీసుకోవలసిన చర్యలపై జూన్ 15 తర్వాత కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు.

  • “తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత – చేవెళ్ల పూర్తి చేయడం వల్ల ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశం ఉంటుంది. ఆదిలాబాద్ అనగానే తుమ్మిడిహెట్టి గుర్తొస్తుంది. ఆ ప్రాజెక్టును చేపట్టడానికి ఏడాది కాలంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాం… కానీ స్పందించడం లేదు.
  • రాష్ట్రాల మధ్య చర్చలు సంప్రదింపుల ద్వారా నీటి సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి చెబుతున్నారు. అంతరాలు, అవాంతరాలను తొలగించుకోవడానికి సమయం ఇవ్వాలని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు లేఖ రాశాం. కానీ మహారాష్ట్ర సీఎం తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారు. సమస్య పరిష్కరించుకోవడానికి కనీస గౌరవం కూడా పాటించడం లేదు.
  • నిర్లక్ష్యం చేస్తే, అవమానిస్తే తెలంగాణ ఊరుకోదు. మా బాధను, ఆవేదనను అర్థం చేసుకోండి. ఈ విషయంలో రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి దూతగా వ్యవహరించాలి. ప్రజా ప్రభుత్వానికి బేషజాలు లేవు. పంతాలు పట్టింపులు లేవు.
  • తుమ్మడిహెట్టి పూర్తి చేయడానికి మహారాష్ట్రలో 2 వేల ఎకరాల భూ సేకరణ చేయాలి. అందుకు మహారాష్ట్ర అంగీకరించాలి అని పేర్కొంటూ పోలవరం ప్రాజెక్టు కోసం గతంలో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారు. తుమ్మిడిహెట్టి విషయాన్ని పదే పదే లేవనెత్తుతున్నా, లేఖలు రాస్తున్నా స్పందించే ప్రయత్నం చేయడం లేదు" అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe