...
...
Next Story

TG Asara Pensions : ఇకపై నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే పెన్షన్ డబ్బులు - సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

రాష్ట్రంలోని 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెలా ఒకటో తారీఖునే జీతాలు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెన్షన్ల పంపిణీ, పంచాయతీల సొంత ఆదాయంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Published on: May 27, 2026, 05:12:19 IST
Advertisement

CM Revanth On Asara Pensions : రాష్ట్రంలోవని పెన్షన్ లబ్ధిదారులకు మరింత పారదర్శకంగా, వేగంగా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో పాటు వివిధ వర్గాలకు అందిస్తున్న సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ విధానంలో మార్పులు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

నేరుగా బ్యాంకు ఖాతాలోకే…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

ప్రస్తుతం పోస్టల్ శాఖ ద్వారా సాగుతున్న పెన్షన్ల పంపిణీ పద్ధతికి స్వస్తి పలికి…. ఇకపై నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే (డీబీటీ విధానం) నగదు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.

నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయటం వల్ల ఎలాంటి అవకతవకలకు తావుండకూడదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పెన్షన్ కేవలం నిజమైన, అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే అందేలా కఠినమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ఓటర్ గుర్తింపు కార్డు (ఓటర్ ఐడీ), ఆధార్ కార్డు, మరియు ఎస్ఈఈఈపీసీ (SEEEPC) సర్వే డేటాను క్షుణ్ణంగా పరిశీలించి…. వాటి ఆధారంగానే లబ్ధిదారుల జాబితాను క్రమబద్ధీకరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అనర్హుల చేతుల్లోకి ప్రభుత్వ సొమ్ము వెళ్లకుండా అడ్డుకట్ట వేయడమే ఈ స్క్రీనింగ్ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.

ఒకటో తారీఖునే జీతాలు - సీఎం ఆదేశాలు

రాష్ట్రంలోని 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెలా మొదటి తారీఖునే జీతాలు చెల్లించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఐఏఎస్ అధికారులకు నెలనెలా సమయానికి జీతాలు అందినట్లే గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా వేతనాలు అందాలని స్పష్టం చేశారు. మ పంచాయతీ సిబ్బంది జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం నుంచి ప్రతినెలా రూ. 50కోట్లు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.

పంచాయతీరాజ్ చట్టం, 2018 లోని సెక్షన్ 70 (3) ప్రతిపాదిత సవరణ ప్రకారం గ్రామ పంచాయతీ స్వంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాలో కాకుండా బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా సవరణ చేయాలని అధికారులను ఆదేశించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe