పేదలకు అన్యాయం చేయం... డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సిద్ధం చేశాం - సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ సిటీని మరింత మంచి నగరంగా అభివృద్ధి చేసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. చెరువుల పునరుద్ధరణలో నిర్వాసితులైన వారికి ప్రభుత్వం న్యాయం చేస్తుందని హామీనిచ్చారు. పేదవాళ్లకు అన్యాయం చేయమని… డబుల్ బెడ్రూం ఇండ్లను సిద్ధం చేశామని ప్రకటించారు.

Published on: Mar 10, 2026, 08:21:09 IST
ANI | By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ నగరంలో రోడ్లను విస్తరించుకోవటంతో పాటు చెరువులను పునరుద్ధరించుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నాలాల ఆక్రమణలను తొలగించుకుందామని సూచించారు. పిల్లలకు క్రీడా మైదానాలు కట్టుకోవాలని… అభివృద్ధి చెందుతున్న ఒక మంచి నగరంగా అభివృద్ధి చేసుకుందామన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కూకట్‌పల్లిలో హైడ్రా పునరుద్ధరించిన నల్లచెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. చెరువులో గంగమ్మతల్లికి హారతినిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.

కొందరికి కష్టమొచ్చినా… బాధపడినా చెరువుల పునరుద్ధరణ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చెరువులు, నాలాలను ఆక్రమించుకున్నవారు సహకరిస్తే.. వారికి న్యాయం చేస్తామని ప్రకటించారు. చెరువులు, కాల్వలు ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. చెరువుల పునరుద్ధరణలో నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని హామీనిచ్చారు.

సీఎం రేవంత్ ప్రసంగం - ముఖ్యమైన అంశాలు:

  • "దేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్ అత్యంత సురక్షితమైన నగరం. అయితే, ఆక్రమణలు తొలగించి, కాలుష్యం నివారించి మూసీ నదిని పునరుద్ధరించుకోవలసిన అవసరం ఉంది. లేదంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు.
  • హైడ్రాను ఏర్పాటు చేసినప్పుడు, హైడ్రా పనులు ప్రారంభించినప్పుడు చాలా మంది నాపై విమర్శలు చేశారు. ఇందులో నాకెలాంటి దురుద్దేశం లేదు. నల్లచెరువును పునరుద్ధరించిన తర్వాత వేలాది మంది మొహాల్లో ఆనందం చూసినప్పుడు సంతోషం కలిగింది.
  • పునరుద్ధరించిన చెరువు పార్కుల చుట్టూ వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేద్దాం. స్టాల్స్ పెట్టాలి. పిల్లలు ఆడుకోవడానికి స్థలాల్లేవు. చెరువుల ఒడ్డున ఆటస్థలాలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రాంతంలో ఉన్న చెరువులన్నింటినీ పునరుద్ధరించుకుందాం.
  • ఇలాంటి పనులు చేసుకునప్పుడు నిజంగానే కొందరికి నష్టం కలిగి ఉండొచ్చు. పేదవాళ్లకు ఎవరికీ అన్యాయం చేయను. అలాంటి వారికి డబుల్ బెడ్రూం ఇండ్లను సిద్ధం చేశాం. నిజంగా నష్టం జరిగిన వారికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకుందాం.
  • రాజకీయలతో సంబంధం లేకుండా నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాలి. ఈ ప్రాంతాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేద్దాం.
  • అహ్మదాబాద్‌లో సబర్మతీ రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్, యూపీలో గంగానది రివర్ ఫ్రంట్ నిర్మించుకుని ఆ నగరాలను అభివృద్ధి చేసుకున్నప్పుడు మనమెందుకు మూసీని ప్రక్షాళన చేయకూడదు" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More