తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేరళలో అరుదైన గౌరవం లభించింది. కేరళ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సీనియర్ నాయకుడు ఆర్యదాన్ ముహమ్మద్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డును సీఎం రేవంత్ రెడ్డి అందుకున్నారు.

కేరళలోని నిలంబూర్ వేదికగా ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ అత్యంత వైభవంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎంపీ, పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్ కేసీ వేణుగోపాల్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
గౌరవంగా భావిస్తున్నా - సీఎం రేవంత్
అవార్డు స్వీకరణ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ….. ఆర్యదాన్ ముహమ్మద్ వంటి మహోన్నత నాయకుడి పేరు మీద నెలకొల్పిన అవార్డును అందుకోవడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ అవార్డుకు తనను ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా, కేరళ సరిహద్దుల వెలుపల నుంచి ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన అత్యంత తొలి వ్యక్తిని కావడం తనకు మరింత గర్వకారణంగా ఉందన్నారు.
కేరళ రాష్ట్రంతో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. "నేను కేరళ భూమిపై అడుగుపెట్టిన ప్రతిసారీ ఇక్కడి ప్రజలు నాపై అపారమైన ప్రేమాభిమానాలను కురిపించారు. ఎంతో ఆత్మీయ స్వాగతం పలికారు. గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో చారిత్రాత్మకంగా సాగిన 'భారత్ జోడో యాత్ర' సందర్భంగా నేను ఇక్కడికి వచ్చాను. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇక్కడ ప్రచారం కోసం వచ్చాను. కేరళ నాకు ఎంతో ఆత్మీయమైన రాష్ట్రం. దేశంలో లౌకికవాద మూలాలను కాపాడటంలో కేరళ ప్రజలు ఎప్పుడూ ముందుంటారు. లౌకిక విలువలకు కట్టుబడి ఉన్నందుకు ఈ వేదికగా కేరళ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
దివంగత నేత ఆర్యదాన్ ముహమ్మద్ సేవలను సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. "ఆర్యదాన్ ముహమ్మద్ కేరళ రాజకీయాల్లో ఒక గొప్ప ప్రజా నాయకుడు. నిలంబూర్ నియోజకవర్గం నుంచి ఏకంగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు అసమాన సేవలందించారు. పలువురు ముఖ్యమంత్రుల హయాంలో నాలుగుసార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. కేరళ రాజకీయ వేదికపై ఆయన ఒక నిజమైన చాణక్యుడిలా వ్యవహరించేవారు," అని ప్రశంసించారు.
{{/usCountry}}దివంగత నేత ఆర్యదాన్ ముహమ్మద్ సేవలను సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. "ఆర్యదాన్ ముహమ్మద్ కేరళ రాజకీయాల్లో ఒక గొప్ప ప్రజా నాయకుడు. నిలంబూర్ నియోజకవర్గం నుంచి ఏకంగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు అసమాన సేవలందించారు. పలువురు ముఖ్యమంత్రుల హయాంలో నాలుగుసార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. కేరళ రాజకీయ వేదికపై ఆయన ఒక నిజమైన చాణక్యుడిలా వ్యవహరించేవారు," అని ప్రశంసించారు.
{{/usCountry}}నిలంబూర్‌లోనే కాకుండా మొత్తం కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆర్యదాన్ ముహమ్మద్ ఒక మహావృక్షంలా అండగా నిలిచారని సీఎం గుర్తుచేశారు. "తన జీవితాంతం స్వేచ్ఛ, ప్రజాస్వామ్య రక్షణ, లౌకికవాదం మరియు భారత రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఆయన పోరాడారు. ప్రస్తుత దేశ పరిస్థితుల్లో రాజ్యాంగ మౌలిక సూత్రాలను కాపాడుకోవడానికి ఆర్యదాన్ ముహమ్మద్ చూపిన స్ఫూర్తితో మనమందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది," అని పిలుపునిచ్చారు.
ఈ వైభవంగా జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ చైర్మన్ ఆర్యదాన్ షౌకత్, కేరళ రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, సీనియర్ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.