Bandi Bhagirath POCSO Case : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు న్యాయస్థానంలో తాత్కాలిక ఉపశమనం లభించింది. హైదరాబాద్ మల్కాజ్‌గిరిలోని పోక్సో ప్రత్యేక కోర్టు ఆయనకు ఏడు రోజుల పాటు తాత్కాలిక (ఇంటరిమ్) బెయిల్ మంజూరు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో భగీరథ్ ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

బండి సాయి భగీరథ్ తన చివరి సెమిస్టర్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉన్నందున…. పరీక్షలు రాసుకునేందుకు వీలుగా కోర్టు ఈ తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిందని సమాచారం. కేవలం ఏడు రోజుల కాలపరిమితికి మాత్రమే పరిమితమైన ఈ బెయిల్ కోసం న్యాయస్థానం పలు కఠినమైన షరతులను కూడా విధించినట్లు తెలుస్తోంది.
దాదాపు నెలరోజుల పాటు చర్లపల్లి జైల్లో ఉన్న భగీరథ్ ఇవాళ మధ్యాహ్నం విడుదలయ్యారు. ఈనెల 28 వరకు (వారంపాటు) బెయిల్ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి.
కేసు ఏంటి..?
17 ఏళ్ల బాలికను మభ్యపెట్టి, ఫామ్‌హౌస్‌లలో లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఫిర్యాదుతో మే 8న ఈ కేసు నమోదైంది. మరోవైపు భగీరథ్ తరపున ఇది 'హనీ ట్రాప్' అని, తనను బ్లాక్ మెయిల్ చేసి రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని కరీంనగర్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. రెండు పిటిషన్లపై పోలీసులు విచారణ జరిపారు.
పోక్సో కేసును సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం… ప్రత్యేకంగా సిట్ కూడా ఏర్పాటు చేసింది. అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు…. భగీరథ్ ను అదుపులో తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు కాగా… ఉన్నత న్యాయస్థానం అందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో న్యాయవాదుల సమక్షంలో భగీరథ్ పోలీసులకు లొంగిపోయాడు. ఆ తర్వాత మేడ్చల్ కోర్టులో హాజరుపర్చగా…. రిమాండ్ విధించింది.
అప్పట్నుంచి భగీరథ్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఎగ్జామ్స్ ఉన్న కారణంగా…. తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపినట్లు సమాచారం.
{{/usCountry}}అప్పట్నుంచి భగీరథ్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఎగ్జామ్స్ ఉన్న కారణంగా…. తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపినట్లు సమాచారం.
{{/usCountry}}