హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. జులై 22 వరకు అప్లికేషన్, మంచి జీతం!

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్(CWC) హైదరాబాద్‌తో సహా వివిధ ప్రాంతాలలో 6 యంగ్ ప్రొఫేషనల్ నియామకం కోసం ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జులై 22, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated on: Jul 19, 2026, 18:26:38 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు, ముఖ్యంగా హైదరాబాద్‌లో కావాలనుకునే యువతకు ఒక శుభవార్త. భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న సీపీఎస్‌ఈ (CPSE) సంస్థ అయిన సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (CWC) వివిధ విభాగాలలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగాలు
సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగాలు

మొత్తం 6 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ జారీ చేయగా, అందులో హైదరాబాద్ రీజినల్ ఆఫీస్ పరిధిలోనే 2 పోస్టులు ఉండటం గమనార్హం. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్ యువతకు ప్రాధాన్యత ఉండేలా మార్కెటింగ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పోస్టు పేరు యంగ్ ప్రొఫెషనల్ (మార్కెటింగ్ & బిజినెస్ డెవలప్‌మెంట్). హైదరాబాద్‌లో ఖాళీల సంఖ్య 02. కాంట్రాక్ట్ కాలపరిమితి చూసుకుంటే మొదట రెండేళ్ల కాలానికి తీసుకుంటారు. ప్రతిభ ఆధారంగా దీనిని మరో ఏడాది పొడిగించే అవకాశం ఉంది.

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి జనరల్ మేనేజ్‌మెంట్/ మార్కెటింగ్/ లాజిస్టిక్స్/ సప్లై చైన్ మేనేజ్‌మెంట్/ సేల్స్ & మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పూర్తి కాలపు రెగ్యులర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా (PGDM) లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (MBA) ఉత్తీర్ణులై ఉండాలి. వేర్‌హౌసింగ్ లేదా లాజిస్టిక్స్ రంగంలో (ప్రభుత్వ/ ప్రైవేట్/ కమర్షియల్ సంస్థల్లో) 0 నుండి 3 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్నవారు అర్హులు.

హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న ఖాళీల వివరాలు చూసుకుంటే.. యంగ్ ప్రొఫెషనల్ (లర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్) - 01 పోస్టు (న్యూఢిల్లీ), యంగ్ ప్రొఫెషనల్ (PCS మార్కెటింగ్) - 01 పోస్టు (పాట్నా), యంగ్ ప్రొఫెషనల్ (మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్) - 02 పోస్టులు (జైపూర్)లో ఉన్నాయి.

0 నుండి 3 ఏళ్ల లోపు అనుభవం ఉన్నవారికి రూ. 50,000 (ఫిక్స్‌డ్), 3 ఏళ్ల కంటే ఎక్కువ అనుభవం ఉన్నవారికి రూ. 60,000(ఫిక్స్‌డ్), అధికారిక పర్యటనల సమయంలో నిబంధనల ప్రకారం టీఏ/డీఏ, లాడ్జింగ్ ఛార్జీలు లభిస్తాయి.

దరఖాస్తులు 09 జూలై 2026 ప్రారంభమయ్యాయి. చివరి తేదీ 22 జూలై 2026 (రాత్రి 11:59 గంటల వరకు) ఉంది. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం, అప్లై చేయడానికి https://cwceportal.com/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More