ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.
Metal Coated Sweets : మెరిసేదంతా వెండి కాదు.. స్వీట్లు, పాన్ల మీద మెటల్ కోటెడ్పై డాక్టర్ల వార్నింగ్!
స్వీట్లు, పాన్ల అలంకరణలో వెండి రేకు (Silver Foil) బదులు ప్రమాదకరమైన అల్యూమినియం షీట్లను వాడుతున్నట్లు ఇటీవల తెలంగాణలో అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. వీటితో అనేక ఆరోగ్య సమస్యలు రానున్నట్టుగా వైద్యులు చెబుతున్నారు.
పండుగలు, శుభకార్యాల వేళ నోరూరించే స్వీట్లు, పాన్లపై మెరిసే వెండి రేకు (Silver Foil ) చూసి టెంప్ట్ అవుతున్నారా? మీరు తింటున్నది అసలైన సిల్వర్ కోటెడ్ స్వీట్ కాదు. అది ప్రాణాంతకమైన అల్యూమినియం రేకు కావొచ్చు. ఇటీవల హెచ్-ఫాస్ట్ (H-Fast), తెలంగాణ ఫుడ్ సేఫ్టీ (TG SAFE) విభాగాల అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఖర్చు తగ్గించుకునేందుకు కొన్ని స్వీట్ షాపులు, పాన్ విక్రయదారులు ఖరీదైన వెండి రేకు స్థానంలో చౌకగా దొరికే అల్యూమినియం షీట్లను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

దీంతో మెటల్ ఫాయిల్స్ (లోహపు రేకులు) పూత ఉన్న స్వీట్లు తినడం వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలపై వైద్య నిపుణులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ఆహార పదార్థాలకు ఆకర్షణీయమైన రూపాన్ని తీసుకురావడానికి మాత్రమే ఈ లోహపు రేకులను వాడతారని, వీటివల్ల శరీరానికి ఎటువంటి పోషక విలువలు లభించవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల, ఎలాంటి లోహపు పూత లేని సాధారణ స్వీట్లను ఎంచుకోవడమే ఆరోగ్యానికి అత్యంత శ్రేయస్కరమని సూచిస్తున్నారు. అల్యూమినియం రేకు ఉన్న ఆహారాన్ని తరచుగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
శరీరంలోకి అల్యూమినియం మోతాదుకు మించి చేరడం వల్ల జీర్ణాశయ ప్రేగులు, ఎముకలు మరియు మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీర్ఘకాలికంగా అల్యూమినియం ప్రభావానికి గురికావడం వల్ల ఎముకలు బలహీనపడటమే కాకుండా, ఎముక మజ్జ పనితీరు దెబ్బతిని రక్తహీనతకు దారితీస్తుంది. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులతో బాధపడేవారిలో మూత్రపిండాలు ఈ లోహాన్ని సమర్థవంతంగా బయటకు పంపలేవు. ఫలితంగా శరీరంలో అల్యూమినియం పేరుకుపోయి జ్ఞాపకశక్తి తగ్గడం వంటి నాడీ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
తరచుగా అల్యూమినియం కోటెడ్ స్వీట్స్ తీసుకోవడం వల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియా దెబ్బతిని ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ దుష్ప్రభావాలు వెంటనే బయటపడవని, దీర్ఘకాలం పాటు తీసుకోవడం వల్ల నెమ్మదిగా శరీరంపై ప్రభావం చూపిస్తాయి. ఈ స్వీట్ల వల్లే సమస్యలు వచ్చాయని జనాలు గుర్తించడం కష్టమవుతుంది. చిన్నారులు, వృద్ధులు ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) నిబంధనల ప్రకారం, ఆహార అలంకరణకు వాడే వెండి రేకు కచ్చితంగా 99.9 శాతం స్వచ్ఛమైన వెండి అయి ఉండాలి. అయినప్పటికీ వెండిని కూడా ఎక్కువ కాలం పాటు ఆహారంతో పాటు తీసుకోవడంపై ఆరోగ్య నిపుణుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీర్ఘకాలం పాటు వెండి శరీరంలోకి చేరడం వల్ల ఆర్గిరియా అనే అరుదైన సమస్య తలెత్తే అవకాశం ఉంది. దీనివల్ల శరీరంలో వెండి కణాలు పేరుకుపోయి, చర్మం నీలం-బూడిద రంగులోకి మారిపోతుంది.
నకిలీ రేకులను గుర్తించడం ఎలా?
స్వీట్‌పై ఉన్న రేకును వేలితో సున్నితంగా రుద్దితే, అది అసలైన వెండి అయితే పూర్తిగా కరిగిపోయి వేలికి అంటుకోకుండా మాయమవుతుంది. అదే అల్యూమినియం అయితే చిన్న ముక్కలుగా విరిగి, ఉండలా చుట్టుకుంటుంది.
రేకును కొద్దిగా తీసి మంటపై కాల్చినప్పుడు స్వచ్ఛమైన వెండి అయితే చిన్న మెరిసే బంతిలా మారుతుంది. అల్యూమినియం అయితే నల్లటి బూడిద మిగులుతుంది.

E-Paper
