...
...
Next Story

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ - పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు, షెడ్యూల్ ఇదే!

బల్హార్షా స్టేషన్‌లో యార్డ్ రీమోడలింగ్ పనుల కారణంగా పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతో పాటు మరికొన్నింటి వేళల్లో మార్పులు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే వివరాలను పేర్కొంది.

Published on: Oct 30, 2026, 20:24:14 IST
Advertisement

రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. సెంట్రల్ రైల్వే పరిధిలోని నాగ్‌పూర్ డివిజన్ వార్ధా-బల్హార్షా మూడో లైన్ ప్రాజెక్టులో భాగంగా బల్హార్షా రైల్వే స్టేషన్‌లో యార్డ్ రీమోడలింగ్ పనులు చేపడుతున్నారు. ఈ ఆధునీకరణ పనుల కారణంగా అక్టోబర్ 29 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు పలు రైళ్ల సర్వీసులను పాక్షికంగా రద్దు చేయనున్నారు. మరికొన్ని రైళ్లను ఆలస్యంగా నడపనున్నారు.

పాక్షికంగా రద్దయిన రైళ్ల వివరాలు:

  • రైలు నంబర్ 11001 (సీఎస్‌టీ ముంబై - బల్హార్షా) : అక్టోబర్ 29 నుంచి నవంబర్ 3 వరకు ఈ రైలు బల్హార్షా వరకు కాకుండా ఆదిలాబాద్‌లోనే తన ప్రయాణాన్ని ముగిస్తుంది.
  • రైలు నంబర్ 11002 (బల్హార్షా - సీఎస్‌టీ ముంబై): అక్టోబర్ 30 నుంచి నవంబర్ 5 వరకు ఈ రైలు బల్హార్షాకు బదులుగా ఆదిలాబాద్ నుంచే తిరుగు ప్రయాణం ప్రారంభిస్తుంది .
  • రైలు నంబర్ 17035 (కాజీపేట - బల్హార్షా): నవంబర్ 2 నుంచి నవంబర్ 4 వరకు ఈ రైలు మాణిక్‌గఢ్ వరకు మాత్రమే నడుస్తుంది.
  • రైలు నంబర్ 17036 (బల్హార్షా - కాజీపేట): నవంబర్ 3 నుంచి నవంబర్ 5 వరకు ఈ రైలు బల్హార్షాకు బదులు మాణిక్‌గఢ్ నుంచే కాజీపేటకు బయలుదేరుతుంది.
  • రైలు నంబర్ 17033 (భద్రాచలం - బల్హార్షా): నవంబర్ 3 నుంచి నవంబర్ 4 వరకు ఈ రైలు మాణిక్‌గఢ్ వద్దనే నిలిచిపోతుంది.
  • రైలు నంబర్ 17004 (బల్హార్షా - కాజీపేట): నవంబర్ 3 నుంచి నవంబర్ 4 వరకు ఈ రైలు బల్హార్షాకు బదులుగా మాణిక్‌గఢ్ నుంచే బయలుదేరుతుంది.

ఆలస్యంగా నడిచే వివరాలు :

  • రైలు నంబర్ 17007 (చర్లపల్లి - దర్భంగా) : అక్టోబర్ 31న ఈ రైలు 50 నిమిషాల పాటు ఆలస్యంగా నడుస్తుంది.
  • రైలు నంబర్ 12771 (సికింద్రాబాద్ - రాయ్‌పూర్) : నవంబర్ 4న ఈ రైలు 1 గంట 15 నిమిషాల పాటు ఆలస్యంగా బయలుదేరుతుంది.
  • రైలు నంబర్ 22737 (సికింద్రాబాద్ - హిసార్) : నవంబర్ 4న ఈ రైలు 25 నిమిషాల పాటు ఆలస్యంగా నడుస్తుంది.

పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు
పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు
 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks