Vehicle Ownership Transfer :వాహనదారులకు శ్రమ, సమయం ఆదా చేసేలా రవాణా శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. వాహన యాజమాన్య బదిలీ, ఇతర రాష్ట్రాలకు వాహనాన్ని తరలించడానికి అవసరమైన నిరభ్యంతర పత్రం, అలాగే యజమాని ఈ-కేవైసీ వివరాల అప్‌డేట్... ఈ మూడు కీలక సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రవాణా శాఖ శనివారం వెల్లడించింది.

ఇకపై రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, అధికారిక 'వాహన్ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్' ద్వారా ఆధార్ ఓటీపీ ధ్రువీకరణతో ఈ సేవలను అత్యంత సులభంగా పొందవచ్చని అధికారులు స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించాలని…. వివరాలు నమోదు చేసే సమయంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు.
ముఖ్యంగా ఆధార్ ఓటీపీని ఎవరితోనూ పంచుకోవద్దని భద్రతా హెచ్చరికలు జారీ చేశారు. దీనికితోడు, సదరు వాహనంపై ఏమైనా నేర సంబంధిత రికార్డులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని జాతీయ నేర రికార్డుల విభాగం డేటాబేస్ ద్వారా తనిఖీ చేసుకునే వెసులుబాటు కూడా ఈ వ్యవస్థలో ఉందని వివరించారు.
ప్రాసెస్ ఇలా….
- వాహనాన్ని వేరొకరికి విక్రయించినప్పుడు యాజమాన్య బదిలీని పూర్తి చేయడానికి విక్రయదారు…. కొనుగోలుదారు ఇద్దరూ పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
- ఇద్దరూ తమ ఆధార్ సంఖ్యతో వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి గుర్తింపును ధ్రువీకరించాలి. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో నిర్ణీత రుసుము (ఫీజు) చెల్లించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
- అధికారులు సమర్పించిన వివరాలన్నింటినీ పరిశీలించి ఆమోదం తెలిపాక, ఆర్టీఓ కార్యాలయం నుంచి కొత్త రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) జారీ అవుతుంది.
- దీంతోపాటు వాహన్ పోర్టల్‌లో కొత్త యజమాని వివరాలు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయి.
ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాన్ని మరొక రాష్ట్రానికి శాశ్వతంగా తరలించాలనుకునే వారు కూడా ఎన్‌ఓసీ కోసం ఆర్టీఓ ఆఫీసులకు వెళ్లాల్సిన పనిలేకుండా ఆన్లైన్ విధానాన్ని తెచ్చారు. వాహన రిజిస్ట్రేషన్ వివరాలు, యజమాని సమాచారంతో పాటు అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి, ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ పరిశీలన పూర్తయిన తర్వాత ఆన్లైన్ ద్వారానే డిజిటల్ ఎన్‌ఓసీ పొందవచ్చు.
{{/usCountry}}ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాన్ని మరొక రాష్ట్రానికి శాశ్వతంగా తరలించాలనుకునే వారు కూడా ఎన్‌ఓసీ కోసం ఆర్టీఓ ఆఫీసులకు వెళ్లాల్సిన పనిలేకుండా ఆన్లైన్ విధానాన్ని తెచ్చారు. వాహన రిజిస్ట్రేషన్ వివరాలు, యజమాని సమాచారంతో పాటు అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి, ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ పరిశీలన పూర్తయిన తర్వాత ఆన్లైన్ ద్వారానే డిజిటల్ ఎన్‌ఓసీ పొందవచ్చు.
{{/usCountry}}వాహన యజమానుల గుర్తింపు వివరాలను డిజిటల్ పద్ధతిలో ధ్రువీకరించడానికి ఈ-కేవైసీ సేవలను ప్రవేశపెట్టారు. యజమానులు వాహన్ పోర్టల్‌లో తమ వాహన రిజిస్ట్రేషన్ నంబరు, ఛాసిస్ నంబరు నమోదు చేసి, ఆధార్ ఓటీపీ ద్వారా ధ్రువీకరణను క్షణాల్లో పూర్తి చేసుకోవచ్చు. కేవైసీలో వివరాలు ఒకసారి సబ్మిట్ చేశాక మార్పులు చేయడానికి వీలుండదని రవాణశాఖ స్పష్టం చేసింది.