వీడియో : అమీర్‌పేట మైత్రివనం సమీపంలో అగ్నిప్రమాదం.. కోచింగ్ సెంటర్‌లో విద్యార్థులు

Hyderabad: అమీర్‌పేటలోని మైత్రివనం సమీపంలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక కోచింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి.

Published on: Feb 20, 2026, 13:08:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ అమీర్‌పేటలోని మైత్రివనం సమీపంలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో కాంప్లెక్స్‌లోని ఒక కోచింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. విద్యార్థులు మంటల్లో చిక్కుకున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి వచ్చి మంటలు ఆర్పుతున్నారు. విద్యార్థులను బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ప్యానెల్ బోర్డులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.

అమీర్‌పేటలో అగ్నిప్రమాదం
అమీర్‌పేటలో అగ్నిప్రమాదం

జనాలు కింద అధిక సంఖ్యలో గుమిగూడినట్టుగా వీడియోలో కనిపిస్తోంది. భవనం దగ్గర దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. నాల్గో అంతస్తులో ఉన్న ఒక కోచింగ్ సెంటర్‌ లోపల విద్యార్థులు చిక్కుకున్నారు. పోలీసు, అగ్నిమాపక శాఖ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. బాల్కనీల ద్వారా పైన చిక్కుకున్న వారిని కిందకు దించే ప్రయత్నం చేశారు.

ఇటీవలే నాంపల్లిలో అగ్నిప్రమాదం

ఇటీవలే నాంపల్లిలోని ఫర్నిచర్ మాల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. ఆ తర్వాత వెంటనే మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. బేబీ (45),అఖిల్ (11),ప్రణీత్ (8), ఇంతియాజ్(28), హబిబ్(32) చనిపోయారు. దాదాపు 22 గంటలకుపైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.

భవనంలోని సెల్లార్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గోడలకు రంధ్రాలు చేసి లోపలకు వెళ్లాయి రెస్క్యూ బృందాలు. సెల్లార్ మెుత్తం ఫర్నీచర్‌తో నిండి ఉండటం, దట్టమైన పొగ అలుముకోవడంతో అప్పుడు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. ప్లాస్టిక్, కెమికల్స్ దహనం కావడంతో వెలువడిన దట్టమైన విషపూరిత పొగతో ఊపిరి ఆడక చనిపోయారు.

సంఘటన సమయంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి వెళ్లిన ఇంతియాజ్, హబీబ్ మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

సంఘటన జరిగిన ఒక రోజు తర్వాత ఫర్నిచర్ షాపు యజమాని సతీష్ బాచాస్‌ను అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. కస్టడీకి పంపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై అతనిపై కేసు నమోదు చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More