...
...
Next Story

ఉన్నతాధికారిగా బిల్డప్ .... ఎమ్మెల్యేలు, అధికారులే టార్గెట్ - ఏకంగా 43 కేసులు! పోలీసులకు చిక్కిన కేటుగాడు

ఫైనాన్స్ శాఖ అడిషనల్ సెక్రటరీగా నమ్మిస్తూ ఎమ్మెల్యేలు, అధికారులను బురిడీ కొట్టించిన ఘరానా మోసగాడు తోట బాలాజీ నాయుడిని గోల్కొండ టాస్క్ ఫోర్స్, ఫిల్మ్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై ఏపీ, తెలంగాణల్లో 43 కేసులు ఉన్నాయి.

Published on: Nov 7, 2026, 13:52:00 IST
Advertisement

ప్రభుత్వంలో ఉన్నతాధికారినని నమ్మిస్తూ ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులకే బురిడీ కొట్టిస్తున్న ఒక ఘరానా కేటుగాడి గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారిగా అవతారమెత్తియ…. సంక్షేమ పథకాల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న తోట బాలాజీ నాయుడు అలియాస్ అనిల్ కుమార్ అలియాస్ మల్లారెడ్డి (53) అనే నిందితుడిని గోల్కొండ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్, ఫిల్మ్‌నగర్ పోలీసులు ఉమ్మడిగా అరెస్ట్ చేశారు.

తోట బాలాజీ నాయుడు
తోట బాలాజీ నాయుడు

జెఎన్‌టీయూ కాకినాడ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన బాలాజీ నాయుడు…. మొదట రామగుండం ఎన్‌టీపీసీ (NTPC) లో జూనియర్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా, ఆపై అసిస్టెంట్ ఇంజనీర్‌గా పదోన్నతులు పొందుతూ వచ్చాడు. అయితే 2008లో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు చిక్కడంతో ఇతని అసలు స్వరూపం బయటపడింది. ఆ కేసును ఆ తర్వాత సీబీఐ (CBI) కి అప్పగించారు. ఈ ఘటన తర్వాత ఉద్యోగం ఊడటంతో బాలాజీ నాయుడు సులభంగా డబ్బు సంపాదించేందుకు నేరాల బాట పట్టాడు.

ఎమ్మెల్యేలు, అధికారులే టార్గెట్.. మోసం సాగిందిలా!

వివిధ ప్రభుత్వ వెబ్‌సైట్ల నుంచి ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారుల ఫోన్ నంబర్లను బాలాజీ నాయుడు సేకరించేవాడు. ఆ తర్వాత సచివాలయంలోని ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో 'అడిషనల్ సెక్రటరీ'ని అంటూ వారికి ఫోన్ చేసేవాడు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన', రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలు సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరించేవాడు.

ఇలాంటి దగాలు చేయడం బాలాజీ నాయుడికి కొత్తేమీ కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఇతనిపై ఏకంగా 43 నేరపూరిత కేసులు నమోదయ్యాయి. 2016లో ఇతని నేర చరిత్రను పరిగణనలోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీసులు ఇతనిపై తీవ్రమైన పీడీ యాక్ట్ (PD Act) ను కూడా ప్రయోగించారు. జైలు నుంచి బయటకు వచ్చినా ఇతని వైఖరిలో మార్పు రాకపోగా, మళ్లీ పాత దందాలనే కొనసాగించాడు.

ఇటీవల ఫిల్మ్‌నగర్, మంచిర్యాల పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదైన రెండు కేసుల విచారణలో భాగంగా పోలీసులు ఇతడిని అరెస్ట్ చేశారు. అలాగే రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 259/2026 కింద బిఎన్ఎస్ సెక్షన్ 318(4), ఐటీ యాక్ట్ 66(D) ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks