...
...
Next Story

Singareni Free Education : సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు శుభవార్త - పిల్లలకు ఉచిత విద్య..!

Singareni Free Education : సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు సంస్థ పాఠశాలల్లో ఉచిత విద్య అందించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో 12 ఏరియాల్లోని సుమారు 30 వేల మంది కార్మికుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.

Published on: Nov 24, 2026, 14:04:17 IST
Advertisement

Singareni Free Education : తెలంగాణ బొగ్గు గని కార్మిక కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తీపి కబురు అందించాయి. సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సంక్షేమం దిశగా సింగరేణి యాజమాన్యం కీలక అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు సింగరేణి విద్యాసంస్థల్లో పూర్తిగా ఉచిత విద్యను అందించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో సంస్థ పరిధిలోని 12 ఏరియాల్లో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు భారీ ఆర్థిక ఊరట లభించనుంది.

సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు శుభవార్త
సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు శుభవార్త

ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన కోల్ బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ భేటీలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల అభివృద్ధి కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు సంస్థ పాఠశాలల్లో ఉచిత విద్యను ప్రవేశపెట్టాలని యాజమాన్యం నిర్ణయించింది.

400 మంది విద్యార్థులకు తక్షణ ప్రయోజనం

ప్రస్తుతం సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో 9 పాఠశాలలు నడుస్తున్నాయి. వీటిలో ఇప్పటికే చదువుతున్న 400 మంది కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు ఈ ఉచిత విద్యా పథకం తక్షణమే వర్తిస్తుందని యాజమాన్యం స్పష్టం చేసింది. అంతేకాకుండా…. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీరితో పాటు కొత్తగా పాఠశాలల్లో చేరే కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

ప్రైవేట్ పాఠశాలల ఫీజుల భారం తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేయనుంది. యాజమాన్యం కల్పించిన ఈ అవకాశంతో రాబోయే రోజుల్లో మరింత మంది కాంట్రాక్ట్ కార్మికులు తమ పిల్లలను సింగరేణి విద్యాసంస్థల్లో చేర్పించే అవకాశం ఉంది. తమ పిల్లలకు సింగరేణి పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఉచితంగా అందనుండటంపై కార్మికులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks