...
...
Next Story

ఫోన్ ట్యాపింగ్ కేసుపై సజ్జనార్ కామెంట్స్.. అలా ఎలా అంటారన్న హరీష్ రావు

ఫోన్ ట్యాపింగ్ విచారణ పూర్తి కాకముందే అది అక్రమం అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అనడం చట్ట విరుద్ధం అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సజ్జనార్ అలా ఎలా అంటారని ప్రశ్నించారు.

Published on: Feb 2, 2026, 14:37:12 IST
Advertisement

ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు(సిట్‌)కి నాయకత్వం వహిస్తున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్ సోషల్ మీడియా పోస్ట్‌పై హరీష్ రావు స్పందించారు. ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రస్తావిస్తూ చట్టవిరుద్ధం అనే పదాన్ని ఉపయోగించడం ఏంటని హరీష్ రావు ప్రశ్నించారు.

సజ్జనార్‌పై హరీష్ రావు కామెంట్స్
సజ్జనార్‌పై హరీష్ రావు కామెంట్స్

తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ విషయం దర్యాప్తులో ఉండగా దానిని చట్టవిరుద్ధమని ఎలా చెబుతారని అడిగారు. 'ఇటువంటి ప్రకటన చట్టపరంగా నిలకడలేనిది మాత్రమే కాదు, సిట్ చీఫ్ నుండి రావడం చాలా బాధాకరం కూడా.' అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ప్రస్తావిస్తూ, రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో న్యాయస్థానం ఒక తీర్పును నమోదు చేసే వరకు, ఏ ఆరోపణను నేరంగా పరిగణించలేమని ఆయన అన్నారు.

అధికారిక సందేశంలో అక్రమ ఫోన్ ట్యాపింగ్ అనే పదం ఉపయోగించడం ద్వారా సిట్ చీఫ్ దర్యాప్తు ఫలితం గురించి ముందస్తుగా భావించారని హరీష్ రావు అన్నారు. ఈ ప్రవర్తన ఆయనకు తగదని వ్యాఖ్యానించారు. సజ్జనార్ వ్యాఖ్యలు చట్టవిరుద్ధమని అన్నారు. దర్యాప్తులు నిష్పాక్షికంగా ఉండటమే కాకుండా.. నిష్పాక్షికంగా కనిపించేలా కూడా ఉండాలని సుప్రీంకోర్టు పదే పదే పేర్కొన్నదని హరీష్ రావు నొక్కి చెప్పారు.

'అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ ప్రశ్నించడం ముగించింది.' అని సజ్జనార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను ఫిబ్రవరి 1 ఆదివారం రోజున హైదరాబాద్‌ నందినగర్‌లోని ఆయన నివాసంలోనే సిట్ అధికారులు ప్రశ్నించారు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు చేరుకున్న తర్వాత మధ్యాహ్నం 3:00 గంటలకు విచారణ ప్రారంభమైంది. ఒక ప్రత్యేక గదిలో ఏర్పాట్లు చేశారు. దాదాపు 4 గంటల 45నిమిషాల సిట్ విచారణ కొనసాగింది. పలు కోణాల్లో సిట్ అధికారులు ప్రశ్నలు వేశారు. కేసీఆర్ విచారణను సిట్ అధికారులు ఆడియో, వీడియో రికార్డు చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks