హెల్త్ ఇన్సూరెన్స్‌పై తెలంగాణ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కీలక తీర్పు వెలువరించింది. వైద్య పరీక్షలు నిర్వహించకుండా సీనియర్ సిటిజన్‌కు బీమా పాలసీ జారీ చేస్తే, సంబంధిత నష్టాన్ని బీమా సంస్థ భరించాలని స్పష్టం చేసింది. అంటే ముందుగానే వినియోగదారుడికి సంబంధించిన ఆరోగ్య వివరాలు తెలుసుకోవాలని క్లారిటీ ఇచ్చింది. ఆ విషయం తెలుసుకోకుండా.. బీమా ఇచ్చి.. తర్వాత క్లెయిమ్ తిరస్కరించడం కుదరదని చెప్పింది.

పాలసీ చేయాలనుకునే వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ చూడకుండా.. బీమా ఇచ్చి.. ఆ తర్వాత ఆధారంగా క్లెయిమ్‌లను తిరస్కరించలేరని తెలంగాణ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పునిచ్చింది. వైద్య పరీక్షలు నిర్వహించకుండా పాలసీని జారీ చేసిన బీమా కంపెనీ.. ముందుగా ఉన్న అనారోగ్యం కారణంగా వైద్య క్లెయిమ్‌ను తిరస్కరించడానికి వీల్లేదని కమిషన్ పేర్కొంది.
ముందస్తు ఆరోగ్య పరీక్షలు లేకుండా పాలసీని మంజూరు చేస్తే.. ఆ తర్వాత బీమా సంస్థే ఆ నష్టాన్ని భరించాలని కమిషన్ స్పష్టం చేసింది. బీమా సంస్థ ముందుగా ఉన్న వ్యాధిని నిరూపించాలి. పాలసీ తీసుకున్న వ్యక్తికి బీమా చేసుకున్న తర్వాత ముందుగా ఉన్న దీర్ఘకాలిక అనారోగ్యాన్ని ఆరోపించడం సరిపోదని కమిషన్ అభిప్రాయపడింది. చెల్లుబాటు అయ్యే వైద్య ఆధారాలతో అటువంటి క్లెయిమ్‌లను నిరూపించాల్సిన బాధ్యత బీమా కంపెనీపై ఉంటుంది.
2019లో సీనియర్ సిటిజన్ అయిన జి.మన్మోహన్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేశారు. క్రమం తప్పకుండా రూ. 26,550 ప్రీమియం చెల్లించారు. మూడు సంవత్సరాల తర్వాత అతను మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరాడు. వైద్య ఖర్చులు రూ. 2.26 లక్షలు అయ్యాయి.
అయితే పాలసీ తీసుకోవడానికి ముందు అతనికి ఇప్పటికే అనారోగ్యాలు ఉన్నాయని, వాటిని వెల్లడించడంలో విఫలమైందని వాదిస్తూ బీమా కంపెనీ ఆ క్లెయిమ్‌ను తిరస్కరించింది. ఈ తిరస్కరణతో ఆవేదన చెందిన మన్మోహన్, అతని చట్టపరమైన వారసులు జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. బీమా సంస్థకు వైద్య ఖర్చులను చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ, బీమా కంపెనీ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ముందు అప్పీల్ దాఖలు చేసింది.
{{/usCountry}}అయితే పాలసీ తీసుకోవడానికి ముందు అతనికి ఇప్పటికే అనారోగ్యాలు ఉన్నాయని, వాటిని వెల్లడించడంలో విఫలమైందని వాదిస్తూ బీమా కంపెనీ ఆ క్లెయిమ్‌ను తిరస్కరించింది. ఈ తిరస్కరణతో ఆవేదన చెందిన మన్మోహన్, అతని చట్టపరమైన వారసులు జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. బీమా సంస్థకు వైద్య ఖర్చులను చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ, బీమా కంపెనీ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ముందు అప్పీల్ దాఖలు చేసింది.
{{/usCountry}}జిల్లా ఉత్తర్వులను కమిషన్ సమర్థించింది జస్టిస్ జి.రాధారాణి (అధ్యక్షురాలు), సభ్యురాలు ఆర్.ఎస్. రాజేశ్వరిలతో కూడిన ధర్మాసనం ఈ అప్పీల్‌ను విచారించి ఇటీవలే తీర్పును వెలువరిస్తూ, బీమా సంస్థ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. 9శాతం వార్షిక వడ్డీతో వైద్య ఖర్చుల కోసం రూ.2,26,329 చెల్లించాలని కమిషన్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది. అదనంగా పరిహారంగా రూ.10,000, వ్యాజ్యం ఖర్చుల కోసం రూ.5,000 చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.
వైద్య పరీక్షలు లేకుండా పాలసీలు జారీ చేసిన తర్వాత బీమా కంపెనీలు బాధ్యత నుండి తప్పించుకోలేవని కమిషన్ స్పష్టం చేసింది. నిజమైన క్లెయిమ్‌లను గౌరవించాలని తీర్పు పునరుద్ఘాటిస్తుంది. ఆధారాలు లేకుండా ముందుగా ఉన్న వ్యాధులను ఆరోపిస్తూ క్లెయిమ్‌లను తిరస్కరించలేవని కమిషన్ నొక్కి చెప్పింది.